పంట నష్టంపై అసెంబ్లీలో నిరసన: చంద్రబాబు సహా 13 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

By narsimha lodeFirst Published Nov 30, 2020, 3:24 PM IST
Highlights

 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి చంద్రబాబు సహా 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలను  ఒక్కరోజు పాటు సస్పెన్షన్ విధించారు. సస్పెన్షన్ విధించిన సభ్యులను మార్షల్స్ అసెంబ్లీ నుండి బయటకు తరలిస్తున్నారు.


అమరావతి:  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి చంద్రబాబు సహా 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలను  ఒక్కరోజు పాటు సస్పెన్షన్ విధించారు. సస్పెన్షన్ విధించిన సభ్యులను మార్షల్స్ అసెంబ్లీ నుండి బయటకు తరలిస్తున్నారు.

 

ఏపీ అసెంబ్లీ: శాసనసభ నుంచి చంద్రబాబు సహా టీడీపీ ఎమ్యెల్యేల సస్పెన్షన్ pic.twitter.com/pBHf4jzEs4

— Asianetnews Telugu (@AsianetNewsTL)

ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి.ఈ సమావేశాల్లో  నివర్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు.  పంట నష్టంపై టీడీపీ  సభ్యులు నిరసనకు దిగారు. 

స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులు 13 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుండి ఒక్క రోజు పాటు సస్పెన్షన్  చేశారు స్పీకర్.సభా కార్యక్రమాలకు అంతరాయం కల్గిస్తున్నారని టీడీపీ సభ్యులను ఒక్క రోజు పాటు సస్పెన్షన్ చేశారు.

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, ఏలూరి సాంబశివరావు, జోగేశ్వరరావు, అనగాని సత్యప్రసాద్, రామరాజు, బాల వీరాంజనేయస్వామి, వెలగపూడి రామకృష్ణబాబు, ఆదిరెడ్డి భవానీలను ఒక్క రోజు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు. 

సస్పెన్షన్ కు గురైన సభ్యులు అసెంబ్లీ నుండి బయటకు వెళ్లకుండా  నిరసనకు దిగడంతో మార్షల్స్ వారిని సభ నుండి బయటకు తరలించారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద మెట్లపై కూర్చొని టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.


 

click me!