
మంగళగిరి : పేద, బలహీనవర్గాల పిల్లలకు తాను మేనమామనని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటారు... కానీ ఆయన కంసమామలా తయారయ్యాడని టిడిపి ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామి అన్నారు. కాబట్టి రాష్ట్రంలోని మాల సామాజికవర్గ ప్రజల పంతంతో వైసిపి పాలన అంతం కావాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడును నాలుగోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు మాలలంతా కృషిచేయాలని ఎమ్మెల్యే డోలా పిలుపునిచ్చారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన మాలల ఆత్మీయ సమావేశం ఎమ్మెల్యే డోలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సామాజిక భద్రత, న్యాయం ద్వారా ఎన్టీఆర్ పేదలను ఆదుకుంటే... చంద్రబాబు, లోకేష్ లు తమ పక్కన కూర్చులో ఒక మాలనో, ఒక మాదిగనో ఉండేలా చూసి సమన్యాయం చేస్తున్నారన్నారని టిడిపి ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రభుత్వ సలహాదారులుగా కేవలం మేధావులనే నియమిస్తామని జగన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అన్నారు... అంటే దళితుల్లో మేధావులు లేరా? అని ప్రశ్నించారు. ఈ మాటలు దళితులను అవమానించడం కాదా? అని నిలదీసారు. తమ నాయకులు చంద్రబాబు, లోకేష్ లపై దుష్ప్రచారం చేసేందుకే దళితుల గురించి వారు మాట్లాడని మాటలను వక్రీకరిస్తున్నారని అన్నారు. ఇది జగన్ రెడ్డి హీనమైన చరిత్ర అంటూ మండిపడ్డారు.
Read More దళిత ఐఎఎస్, ఐపిఎస్ లారా... 'అయ్యా ఎస్' అనేలా మారొద్దు..: మాజీ మంత్రి ఆనంద్ బాబు
ప్రతిపక్షంలో వున్న మాల ఎమ్మెల్యేనైన తనపై అసెంబ్లీ సాక్షిగా జరిగిన దాడి యావత్ దళిత జాతిపై జరిగిన దాడి అని డోలా వీరాజనేయస్వామి అన్నారు. దళితులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు చేయిస్తోన్నది, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించి మాలలకు ద్రోహి చేసింది జగన్ రెడ్డి, ఆయన ప్రభుత్వమేనని ఆరోపించారు. కాబట్టి తిరిగి మాలలకు సంక్షేమం అందాలన్న, రక్షణ దక్కాలన్నా తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి సూచించారు.