పవన్.. ఎవరయ్యా నీకు స్క్రిప్ట్ రాసిచ్చింది.. నన్ను ట్యూటర్‌గా పెట్టుకో: చింతమనేని

sivanagaprasad kodati |  
Published : Sep 27, 2018, 01:51 PM IST
పవన్.. ఎవరయ్యా నీకు స్క్రిప్ట్ రాసిచ్చింది.. నన్ను ట్యూటర్‌గా పెట్టుకో: చింతమనేని

సారాంశం

పవన్‌తో పాటు అతని చుట్టూ ఉన్న వాళ్లకి రాజకీయాల పట్ల ఎలాంటి అవగాహన లేదన్నారు దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్. నిన్న తనపై చేసిన ఆరోపణలపై చింతమనేని ఇవాళ మీడియాతో మాట్లాడారు

పవన్‌తో పాటు అతని చుట్టూ ఉన్న వాళ్లకి రాజకీయాల పట్ల ఎలాంటి అవగాహన లేదన్నారు దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్. నిన్న తనపై చేసిన ఆరోపణలపై చింతమనేని ఇవాళ మీడియాతో మాట్లాడారు.

పార్లమెంట్‌‌లో ఎంపీలుంటారని.. ఎమ్మెల్యేలుండరని ఆ విషయాన్ని పవన్ తెలుసుకోవాలన్నారు. అలాగే ఆరోపణలు చేసేటప్పుడు చీఫ్ విప్ చింతమనేని అని అంటున్నారని.. తాను చీఫ్ విప్ కాదని..కేవలం విప్ మాత్రమేనని ప్రభాకర్ తెలిపారు.

దెందులూరులో రౌడీ రాజ్యాన్ని అంతం చేయడానికి 18 ఏళ్ల యువకుడిని నిలబెడతారని జనసేన అధినేత అంటున్నారు.. కానీ చట్టసభల్లో పోటీ చేయడానికి కనీస వయసు 25 సంవత్సరాలని చింతమనేని ప్రభాకర్ గుర్తు చేశారు. రాజకీయాల పట్ల కనీస అవగాహన లేకుండా పవన్ కల్యాణ్ ఏం సాధిస్తారని ప్రభాకర్ ప్రశ్నించారు.

రాజకీయాల మీదా, చట్ట సభల మీదా ఏ మాత్రం పరిజ్ఞానం లేని వారిని చుట్టూ పెట్టుకుని.. వాళ్లు రాసిచ్చిందని చదువుతున్నారని.. వాళ్లకు బదులు నన్ను ట్యూటర్‌గా పెట్టుకుంటే మంచి సలహాలు ఇస్తానన్నారు.

అయితే తెలుగుదేశం పార్టీని మాత్రం వీడేది లేదన్నారు. రాజకీయాలంలే సినిమాల్లో నటించినంత సులభం కాదన్న విషయం పవన్ కల్యాణ్ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని చింతమనేని సూచించారు.

పవన్.. నేను మాట్లాడితే మూడు రోజులు అన్నం తినవు: చింతమనేని

పులివెందులలో జగన్‌పై మాట్లాడగలవా..? పవన్‌కు... చింతమనేని సవాల్

పవన్... ఎస్.. నేను అసెంబ్లీ రౌడీనే: చింతమనేని ప్రభాకర్

సైగ చేస్తే తన్ని తగలేస్తారు: చింతమనేనికి పవన్ హెచ్చరిక

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?