ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సహా పలువురు ఎమ్మెల్యేలు విజిల్ ఊదుతూ నిరసనకు దిగారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సహా పలువురు టీడీపీ సభ్యులు విజిల్ ఊదుతూ శుక్రవారంనాడు నిరసనకు దిగారు.శుక్రవారంనాడు ఏపీ అసెంబ్లీ శాసనసభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు తమ నిరసనలు ప్రారంభించారు. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ సభ్యులు ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ అసెంబ్లీని స్పీకర్ సభను వాయిదా వేశారు. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమైన తర్వాత కూడ ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నిరసనను కొనసాగించారు. చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ తరుణంలో సభా కార్యక్రమాలను వీడియో తీస్తున్నారని చీఫ్ విప్ ప్రసాదరాజు స్పీకర్ దృష్టికి తీసుకు వచ్చారు.
also read:ఏపీ అసెంబ్లీలో వీడియో చిత్రీకరణ: ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
undefined
దీంతో టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, ఆశోక్ లను ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఇదే సమయంలో టీడీపీ సభ్యులు విజిల్స్ వేస్తూ నిరసనకు దిగారు. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పీకర్ పోడియం వద్దకు వచ్చి విజిల్ ఊదుతూ నిరసనకు దిగారు.ఈ సమయంలో మార్షల్స్ టీడీపీ సభ్యులకు, అధికార పార్టీ సభ్యులకు మధ్య నిలబడ్డారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుల తీరుపై అధికార పార్టీ సభ్యులు సెటైర్లు వేశారు. మంత్రులు అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి, నారాయణ స్వామి తదితరులు మండిపడ్డారు.
టీడీపీ సభ్యుల నిరసనలతో సభలో గందరగోళ వాతావారణం నెలకొంది.ఈ పరిస్థితుల్లో సభను మరోసారి వాయిదా వేస్తున్నట్టుగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.