నోరు అదుపులో పెట్టుకోవాలి: అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నిరసనలపై మంత్రి బుగ్గన ఫైర్

By narsimha lode  |  First Published Sep 22, 2023, 9:43 AM IST

ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.ఇష్టారీతిలో మాట్లాడవద్దని టీడీపీ సభ్యులకు  మంత్రి సూచించారు.
 



అమరావతి: దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబు అవినీతిపై చర్చిద్దామని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  టీడీపీ సభ్యులకు  సవాల్ విసిరారు. టీడీపీ సభ్యులు నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడాలని మంత్రి సూచించారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నాడు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను  చేపట్టారు స్పీకర్ తమ్మినేని సీతారాం. అయితే  ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే  టీడీపీ సభ్యులు  సభలో నిరసనకు దిగారు. చంద్రబాబు అరెస్ట్ పై  చర్చ చేపట్టాలని  నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శించి ఆందోళన నిర్వహించారు.ఈ ఆందోళనల నేపథ్యంలోనే  ప్రశ్నోత్తరాలను కొద్దిసేపు కొనసాగించారు. మంత్రి  గుడివాడ అమర్ నాథ్  సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెబుతున్న సమయంలో  గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Latest Videos

undefined

దీంతో ఏపీ రాష్ట్ర శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  జోక్యం చేసుకున్నారు. టీడీపీ సభ్యుల తీరుపై  మండిపడ్డారు. సైకో పాలన పోవాలి, దరిద్రపు పాలన పోవాలంటూ టీడీపీ సభ్యులు చేసిన నినాదాలపై  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. నోరుందని ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దని సూచించారు.

స్పీకర్ పోడియం వద్ద నిరసన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేల్లో  చాలా మంది సీనియర్లున్నారని ఆయన గుర్తు చేశారు.చంద్రబాబు దోపిడీపై వివరంగా  చర్చిద్దామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పడానికి పద్దతులుంటాయన్నారు. టీడీపీ సభ్యులు ఇష్టారీతిలో మాట్లాడడాన్ని  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తావిస్తూ తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు కూడ మాట్లాడితే ఏమౌతుందని ప్రశ్నించారు.నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని టీడీపీ సభ్యులకు సూచించారు.

also read:చంద్రబాబు అరెస్ట్‌పై చర్చకు టీడీపీ పట్టు: ఏపీ అసెంబ్లీలో గందరగోళం, వాయిదా

చంద్రబాబునాయుడు పాలనపై  తాము మాట్లాడేందుకు అనేక  అంశాలున్నాయన్నారు.కానీ విలువలను పాటించాలనే  ఉద్దేశ్యంతోనే అడ్డగోలుగా మాట్లాడడం లేదని  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.వయస్సుకు తగ్గట్టుగా ప్రవర్తించాలని  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  టీడీపీ సభ్యులకు సూచించారు.

click me!