నా వృత్తిని మంత్రి అంబటి అవమానించారు: ఏపీ అసెంబ్లీలో మీసం తిప్పడంపై బాలకృష్ణ

By narsimha lode  |  First Published Sep 21, 2023, 12:49 PM IST

ఏపీ అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు తన వృత్తిని అవమానించారని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు.ఆ తర్వాతే తాను  రియాక్ట్ కావాల్సి వచ్చిందన్నారు.


అమరావతి: ఏపీ మంత్రి అంబటి రాంబాబు తనకు మీసం చూపి తొడగొట్టారని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు.మంత్రి తన వృత్తిని అవమానిస్తేనే తాను రియాక్ట్ కావాల్సి వచ్చిందని బాలకృష్ణ వివరించారు.ఏపీ అసెంబ్లీ నుండి సస్పెన్షన్ కు గురైన తర్వాత  టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి  బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.అసెంబ్లీ వేదికగా  తన వృత్తిని మంత్రి అంబటి రాంబాబు అవమానించారన్నారు.దీనికి తాను కౌంటర్ గా  మంత్రి అంబటి రాంబాబుకు మీసం మేలేస్తూ  తొడ కొట్టానని  బాలకృష్ణ వివరించారు.వైసీపీ ఎమ్మెల్యేలు తన వృత్తిని, సినీ కళాకారులను అవమానించారని బాలకృష్ణ విమర్శించారు.తెలుగు సినీ పరిశ్రమను అధికార పార్టీ నేతలు కించపర్చారని ఆయన ఆరోపించారు.

తానే కాదు తన స్థానంలో ఎవరైనా ఈ విషయమై రియాక్ట్ అవుతారన్నారు. తన వృత్తి తనకు తల్లిలాంటిందన్నారు. అలాంటి తన వృత్తిని  అవమానిస్తే తాను ఊరుకుంటానా అని బాలకృష్ణ ప్రశ్నించారు. సినిమాల్లో చూపించుకో అని మంత్రి  అంబటి రాంబాబు అన్నారన్నారు. దీనికి తాను  రా చూసుకుందామని చెప్పానని  బాలకృష్ణ వివరించారు. తాను ఎవరికి భయపడనన్నారు. కేసులకు కూడ తాను భయపడబోనని బాలకృష్ణ తేల్చి చెప్పారు.

Latest Videos

undefined

also read:ఈ నెల 27వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు: రేపు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై చర్చ, బీఏసీకి టీడీపీ దూరం

ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది.  టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తొడకొట్టి మీసం మేలేశారని  ఏపీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. సినిమాల్లో తొడకొట్టి మీసం తిప్పాలని  సూచించారు. బాలకృష్ణకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి కౌంటరిచ్చారు. బాలకృష్ణకు ఎదురెళ్లి తొడకొట్టారు.  రెండు పార్టీల ఎమ్మెల్యేలు పోటాపోటీగా నిరసనలకు దిగారు. దీంతో  సభలో ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో  ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం  అసెంబ్లీని వాయిదా వేశారు. ఆ తర్వాత  అసెంబ్లీ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడ సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.  చంద్రబాబు అరెస్ట్ పై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. అయితే  ఈ వాయిదా తీర్మానాన్ని వాయిదా తిరస్కరించినట్టుగా  స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అయినా కూడ టీడీపీ సభ్యులు తమ నిరసనను ఆపలేదు. దీంతో  సభ నుండి టీడీపీ  ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.

 

click me!