చంద్రబాబును జైల్లోనే చంపించేందుకు దోమల దాడి... సైకో జగన్ కుట్ర ఇదే..: లోకేష్ ఆందోళన

టిడిపి అధినేత చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. 


రాజమండ్రి : మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అదినేత చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపే కుట్రలు జరుగుతున్నాయని ఆయన తనయుడు, మాజీ మంత్రి లోకేష్ ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా స్కిల్ డెవలమ్ మెంట్ కేసులో ప్రధాన సూత్రదారి అంటూ చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసారని... బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారని లోకేష్ అన్నారు. సైకో జగన్ ఇదంతా చేస్తోంది ప్రతిపక్ష నాయకున్ని చంపేందుకే అన్న అనమానాలు రోజురోజుకు మరింత బలపడుతున్నాయని అన్నారు. జైల్లో పరిస్థితులు చూస్తుంటే చంద్రబాబు భద్రతపై తీవ్ర ఆందోళన కలుగుతోందని లోకేష్ అన్నారు. 

న్యాయస్థానం చంద్రబాబుకు జైల్లో కనీస సదుపాయాలు కల్పించాలని ఆదేశించిందని... కానీ ప్రభుత్వం, జైలు అధికారులు వాటిని పట్టించుకోవడం లేదని అన్నారు. బయట జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో చంద్రబాబు వుంటారు కాబట్టి ఏం చేయలేదు... అందువల్లే జైల్లో హాని తలపెట్టడానికి కుట్రలు జరుగుతున్నాయని లోకేష్ ఆరోపించారు. 

Latest Videos

జైల్లో వున్న చంద్రబాబు విపరీతంగా దోమలు కుడుతున్నాయని చెబుతున్నా జైలు అధకారులు పట్టించుకోవడం లేదని లోకేష్ అన్నారు. ఇలా గతంలో రిమాండ్ ఖైదీగా జైల్లో వున్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ దోమలు కుట్టడంతో డెంగ్యూ బారినపడ్డాడని... దీంతో అతడి పరిస్థితి విషమించి మరణించాడని గుర్తుచేసారు. చంద్రబాబును కూడా ఇలాగే చేయాలని సైకో జగన్ కుతంత్రాలు చేస్తున్నాడని అన్నారు. చంద్రబాబుకు ఏం జరిగిని సైకో సీఎం జగన్ బాధ్యత వహించాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. 

Read More  స్విచ్ వేయ‌కుండా ఫ్యాన్ తిర‌గ‌డంలేదంటే ఎలా..? : జైల్లో చంద్ర‌బాబు పై విజ‌య‌సాయి రెడ్డి సెటైర్లు

ఇదిలావుంటే ఇటీవల సెంట్రల్ జైల్లో చంద్రబాబు భద్రతపై నారా భువనేశ్వరి కూడా ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కోడలు బ్రాహ్మణితో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన భువనేశ్వరి దాదాపు 45 నిమిషాలు మాట్లాడారు. వీరితోపాటు టిడిపి సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు కూడా చంద్రబాబును కలిసారు. ఈ సమయంలోనే వీరు చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసాారు. 

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జైల్లో సరైన సౌకర్యాలు లేవని అన్నారు. చంద్రబాబు గదిలో ఏసీ కూడా లేదని... ఏసీ  గురించి జైలు అధకారులను అడిగితే నిబంధనల ప్రకారం కుదరదని   చెప్పినట్టుగా తెలిపారు. చంద్రబాబు  గదిలో విపరీతంగా  దోమలు ఉన్నాయని అన్నాయని యనమల తెలిపారు. 
 

click me!