చంద్రబాబు అరెస్ట్‌పై చర్చకు టీడీపీ పట్టు: ఏపీ అసెంబ్లీలో గందరగోళం, వాయిదా

By narsimha lode  |  First Published Sep 22, 2023, 9:20 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో  టీడీపీ సభ్యులు రెండో రోజూ కూడ టీడీపీ సభ్యులు  నిరసనకు దిగారు. టీడీపీ సభ్యుల నిరసనపై అధికార పక్షం మండిపడింది.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో  శుక్రవారంనాడు టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.  ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ అసెంబ్లీని స్పీకర్  వాయిదా వేశారు.

శుక్రవారం నాడు ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజూ ప్రారంభమయ్యాయి.ఈ సమావేశాలు ప్రారంభం కాగానే  ఏపీ అసెంబ్లీ స్పీకర్  తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను  చేపట్టారు. అయితే  చంద్రబాబుపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని  టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.ఈ వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.  సభ ప్రారంభం కాగానే  స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి  టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. టీడీపీ సభ్యుల తీరును అధికార పక్షం తప్పుబట్టింది. టీడీపీ సభ్యుల తీరును  ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,  అంబటి రాంబాబు తప్పుబట్టారు. టీడీపీ సభ్యులు సభా సంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.   

Latest Videos

స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యుల ఆందోళనలతో  ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ప్ల కార్డులు ప్రదర్శిస్తూ  ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా  టీడీపీ సభ్యులు  నినాదాలు చేశారు. సైకో పాలన పోవాలంటూ  నినాదాలు చేయడంపై అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇష్టారీతిలో మాట్లాడవద్దని టీడీపీ సభ్యులనుద్దేశించి అధికార పక్షం సభ్యులు సూచించారు.అయినా కూడ టీడీపీ సభ్యులు తమ నిరసననలను కొనసాగించారు. దీంతో సభను వాయిదా వేస్తున్నట్టుగా  ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతాారాం ప్రకటించారు.
 

click me!