స్కిల్ డెవలప్మెంట్ స్కాం మీద సీబీఐ విచారణ చేయించాలి : ఉండవల్లి పిల్..

Published : Sep 22, 2023, 08:47 AM IST
స్కిల్ డెవలప్మెంట్ స్కాం మీద సీబీఐ విచారణ చేయించాలి : ఉండవల్లి పిల్..

సారాంశం

స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై సీబీఐతో విచారణ జరిపించాలి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్ వేశారు. 

రాజమండ్రి : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణను ఎదుర్కొంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కుంభకోణం జరిగిందని పెట్టిన కేసులో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం చంద్రబాబును నిందితుడిగా ఆరోపిస్తూ అరెస్టు చేసింది.  ఈ కేసులో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ ను చంద్రబాబుకు విధించింది. 

పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కాం మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణను సిబిఐకి ఇవ్వాలని పిల్ వేశారు. సిబిఐ, ఈడీలతో ఈ స్కామ్ మీద విచారణ జరిపించాలని హైకోర్టును అభ్యర్థించారు.

ఇక టిడిపికి నారా బ్రాహ్మణి నాయకత్వం: అధికారికంగా వెల్లడి

మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారం మీద ప్రస్తుతం ఉండవల్లి అరుణ్ కుమార్ పోరాడుతున్నారు. ఈ విషయం తెలిసిందే. మార్గదర్శి సంస్థ చైర్మన్ రామోజీరావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ లు చిట్ ఫండ్స్ చట్టాన్ని సంవత్సరాల తరబడి అతిక్రమిస్తూ వస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. చిట్స్ రూపంలో ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని రామోజీరావు తమ రామోజీ గ్రూపులోని ఇతర సంస్థలకు మళ్ళించారని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపిస్తున్న  సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?