అసెంబ్లీకి నల్లచొక్కాలతో హాజరు కావాలని టీడీఎల్పీ నిర్ణయం

By narsimha lodeFirst Published Jun 15, 2020, 5:12 PM IST
Highlights

టీడీపీ నేతలపై కేసులను నిరసిస్తూ అసెంబ్లీకి నల్లచొక్కాలతో హాజరు కావాలని టీడీఎల్పీ నిర్ణయం తీసుకొంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ఈ సమావేశం నిర్వహించారు.
 


అమరావతి: టీడీపీ నేతలపై కేసులను నిరసిస్తూ అసెంబ్లీకి నల్లచొక్కాలతో హాజరు కావాలని టీడీఎల్పీ నిర్ణయం తీసుకొంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ఈ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. నల్లచొక్కాలతో అసెంబ్లీకి హాజరు కావాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు. టీడీపీ నేతలపై ప్రభుత్వం  అక్రమ కేసులు పెడుతుందని సమావేశంలో కొందరు నేతలు అభిప్రాయపడ్డారు.

also read:రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు: టీడీఎల్పీ భేటీ, వ్యూహాంపై చర్చ

దీంతో ఈ సమావేశాలకు హాజరుకాకూడదని కొందరు నేతలు సమావేశంలో సూచించారు. అయితే అసెంబ్లీకి వెళ్లకపోతే మండలిలో ప్రభుత్వం మరికొన్ని బిల్లులను ఆమోదించుకొనే అవకాశం ఉందని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. 

అవసరమైతే పరిస్థితిని బట్టి వాకౌట్ చేసి రావాలని మరికొందరు నేతలు కూడ సమావేశంలో సూచించారు. అసెంబ్లీ జరిగిన అన్ని రోజుల పాటు నల్లచొక్కాలతో వెళ్లాలని టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.

ఈ నెల 16వ తేదీన ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాజ్ భవన్ నుండి గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలను ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో, మండలిలో ఎమ్మెల్సీలోనే గవర్నర్ ప్రసంగం వీక్షిస్తారు. 

click me!