టిడిపిలో లగడపాటి సర్వే  షాక్

Published : Sep 23, 2017, 11:27 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
టిడిపిలో లగడపాటి సర్వే  షాక్

సారాంశం

ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ పేరుతో సర్వే అంటూ ఏమి వచ్చినా అది సంచలనమే. తాజాగా అటువంటి సర్వే పేరుతో ఓ నివేదిక టిడిపిలో కలకలం మొదలైంది. టిడిపి పరిస్ధితిపై ఈమధ్యే రాజగోపాల్ ఓ సర్వే చేయించారట. అంటే ఎన్ని సీట్లు వస్తుందని కాదులేండి. పార్టీ పరిస్ధితి ఏ ప్రాంతంలో ఎలావుందనే విషయంలో.

ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ పేరుతో సర్వే అంటూ ఏమి వచ్చినా అది సంచలనమే. తాజాగా అటువంటి సర్వే పేరుతో ఓ నివేదిక టిడిపిలో కలకలం మొదలైంది. టిడిపి పరిస్ధితిపై ఈమధ్యే రాజగోపాల్ ఓ సర్వే చేయించారట. అంటే ఎన్ని సీట్లు వస్తుందని కాదులేండి. పార్టీ పరిస్ధితి ఏ ప్రాంతంలో ఎలావుందనే విషయంలో. ఈమధ్యనే లగడపాటి ముఖ్యమంత్రిని కలిసిన విషయం అందరికీ తెలిసిందే కదా? అప్పుడే తన నివేదికను చంద్రబాబుకు ఇచ్చారని సమాచారం. దాని ఆధారంగానే చంద్రబాబు తమ్ముళ్ళకు ఫుల్లుగా క్లాసులు పీకుతున్నారట.

ఇంతకీ సర్వే రిపోర్టులో ఏముంది? అంటే, రిపోర్టు ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఆధరణ తగ్గుతోందట. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యతరేకత ఎక్కువవుతోందట. అందుకు ప్రధాన కారణాలు రేషన్ కార్డులు, పెన్షన్లు అందకపోవటం, రోడ్ల వ్యవస్ధ అస్తవ్యస్ధంగా ఉండటం, నేతలు అందుబాటులో ఉండకపోవటం లాంటి అనేక సమస్యలు జనాలను పట్టి పీడిస్తున్నాయట. దానికితోడు జనాలకు ఏ లబ్ది అందాలన్నా జన్మభూమి కమిటీల ఆమోదం తప్పని సరి చేయటంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. అదే సమయంలో రూరల్ ఏరియాల్లో నేతల మధ్య గ్రూపు తగదాలు కూడా పార్టీపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయట.

మొన్న నంద్యాల, కాకినాడలో టిడిపి గెలవటమన్నది ప్రత్యేక పరిస్ధితిల్లో మాత్రమే సాధ్యమైందని కూడా లగడపాటి స్పష్టగా చెప్పారట. సాధారణ ఎన్నికలకు మొన్నటి ప్రత్యేక పరిస్ధితులుండవన్నది లగడపాటి అభిప్రాయం. నిరుద్యోగులకు ఇస్తానన్న రూ. 2 వేల భృతి ఇవ్వకపోవటం కూడా గ్రామీణ ప్రాంత యువతలో ప్రభుత్వంపై వ్యతరేకతకు కారణమట. వ్యవసాయ, పారిశ్రామికరంగాలను కుదించేయటం లాంటి అనేక అంశాల్లో జనాల్లో వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోందట. నంద్యాల ఫార్ములనే సాధారణ ఎన్నికల్లో కూడా అమలు చేద్దామనుకున్న చంద్రబాబుకు లగడపాటి సర్వే రిపోర్టు పెద్ద షాక్ అనే చెప్పాలి.

PREV
click me!

Recommended Stories

Republic Day Celebrations 2026: గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పీచ్ | Asianet Telugu
Republic Day Celebrations in Amaravati: చంద్రబాబుకి పవన్ కి లోకేష్ ఘన స్వాగతం| Asianet News Telugu