బ్బాబ్బాబు....ఒక్కసారికి పరువు నిలపండి

First Published Aug 22, 2017, 7:41 AM IST
Highlights
  • సామాజికవర్గాల్లో కాస్త పట్టుందనుకున్న వారితో సమావేశాలు నిర్వహిస్తూ, బ్రతిమలాడుకుంటున్నారు.
  • ‘ఈ ఒక్కసారికి టిడిపికి ఓటు వేసి పరువు నిలపండి‘.
  • ‘2019లో ఓటు ఎవరికి వేయాలో మీఇష్టం, మాకే ఓటు వేయాలని అప్పుడు మేం అడగం’ అంటూ బ్రతిమలాడుకుంటున్నారు.

నంద్యాల ఉపఎన్నికలో టిడిపి నేతల వైఖరి అర్ధం కావటం లేదు. ఒకవైపు భౌతిక దాడులు చేస్తున్నారు. ఇంకోవైపు గిట్టని వారిపై పోలీసులను ఉసిగొల్పుతున్నారు. అదే సమయంలో సామాజికవర్గాల్లో కాస్త పట్టుందనుకున్న వారితో సమావేశాలు నిర్వహిస్తూ, బ్రతిమలాడుకుంటున్నారు. ‘ఈ ఒక్కసారికి టిడిపికి ఓటు వేసి పరువు నిలపండి‘. ‘2019లో ఓటు ఎవరికి వేయాలో మీఇష్టం, మాకే ఓటు వేయాలని అప్పుడు మేం అడగం’ అంటూ బ్రతిమలాడుకుంటున్నారు.

టిడిపి నేతల వైఖరి దేనికి నిదర్శనం. ఏ విధంగా అర్ధం చేసుకోవాలో తెలీక స్ధానికులు అవస్తులు పడుతున్నారు. ఒకటి మాత్రం స్పష్టమైంది. క్షేత్రస్ధాయిలో బలాబలాలను భేరీజు వేస్తే మాత్రం టిడిపి గెలవటం కల్ల. కానీ అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి గెలిచి తీరాలి.

చంద్రబాబునాయుడేమో నేతలకు స్పష్టమైన ఆదేశాలిచ్చేసి నంద్యాల నుండి వెళ్లిపోయారురదాంతో ఇపుడు స్ధానిక నేతలేమో సామాజికవర్గాలను ప్రభావితం చేయగలిగిన వారితో సమావేశాలు నిర్వహించటంలో బిజిగా ఉంటున్నారు. ఒకవేళ గెలిచినా శిల్ప ఏమీ చేయలేడని, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని కూడా ఓటర్లకు, సామాజికవర్గాల నేతలకు టిడిపి నేతలు చెబుతున్నారు.

డబ్బుకు ఎటూ లోటు లేదు కాబట్టి ఎంతైనా వెదచల్లటానికి సిద్దంగా ఉన్నారు. ఏం చేసినా ఉన్నది మంగళవారం మాత్రమే. సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం గడువు ముగియగానే టిడిపి నేతలు తెరవెనుక రాజకీయానికి తెరలేపారు. సామాజికవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించటంలో బిజీగా ఉంటున్నారు. వైశ్య, కాపు, ముస్లిం వర్గాల్లోని పట్టున్న నేతలతో సమావేశాలవుతున్నారు.

ఓ అంచనా ప్రకారం నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లోని ముస్లిం, రెడ్డి సామాజికవర్గాల్లో అత్యధికులు వైసీపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. మిగిలిన సమాజికవర్గాల్లో రెండు పార్టీల మధ్య మొగ్గు కనబడుతోంది. పోలింగ్ రోజు ఎవరికి వేయాలనుకుంటే వారికి ఓటు వేస్తారు.

అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలోని కాపు, వైశ్య, రెడ్డి, సామాజికవర్గాల్లో రెండు పార్టీల మధ్య ఓట్లు చీలిపోతాయన్నది సమాచారం. అయితే ఏ పార్టీకి ఎక్కువ ఓట్లు పడతాయన్న విషయంలో స్పష్టమైన అంచనా అందటం లేదు. అలాగే, మిగిలిన సామాజికవర్గాల ఓట్ల మనోభావాలు కూడా అంతుచిక్కటం లేదు. దాంతో గెలుపుపై ముందే అంచనాకు రావటం కష్టంగా ఉంది.

 

click me!