(వీడియో) ప్రచారం ముగియగానే దాడులు మొదలయ్యాయి

First Published Aug 21, 2017, 7:23 PM IST
Highlights
  • నంద్యాల ఉపఎన్నిక ప్రచారం ఇలా ముగిసిందో లేదో వైసీపీ నేతలపై దాడులు అలా మొదలయ్యాయి.
  • నంద్యాల పట్టణానికి సమీపానే ఉన్న అయ్యలూరు గ్రామంలో పరమేశ్వర్ రెడ్డి అనే వైసీపీ కార్యకర్తపై టిడిపి నేతలు దాడి చేసారు.
  • ఉపఎన్నికలో గెలుపు ఎప్పుడో ఖాయమైపోయిందని చెబుతున్న టిడిపి నేతలు మరి వైసీపీ నేతలపై ఎందుకు దాడులు చేస్తున్నారో ఎవరికీ అర్దం కావటం లేదు. 
  • అంటే, గులుపుపై నమ్మకం లేకపోతేనే ఇటువంటి దాడులకు దిగుతారని జనాలు అనుకుంటారన్న ఇంగితం కూడా టిడిపి నేతలకు ఎందుకు లేదో అర్దం కావటం లేదు.

నంద్యాల ఉపఎన్నిక ప్రచారం ఇలా ముగిసిందో లేదో వైసీపీ నేతలపై దాడులు అలా మొదలయ్యాయి. నంద్యాల పట్టణానికి సమీపానే ఉన్న అయ్యలూరు గ్రామంలో పరమేశ్వర్ రెడ్డి అనే వైసీపీ కార్యకర్తపై టిడిపి నేతలు దాడి చేసారు. ఉపఎన్నికలో గెలుపు ఎప్పుడో ఖాయమైపోయిందని చెబుతున్న టిడిపి నేతలు మరి వైసీపీ నేతలపై ఎందుకు దాడులు చేస్తున్నారో ఎవరికీ అర్దం కావటం లేదు. 

అంటే, గులుపుపై నమ్మకం లేకపోతేనే ఇటువంటి దాడులకు దిగుతారని జనాలు అనుకుంటారన్న ఇంగితం కూడా టిడిపి నేతలకు ఎందుకు లేదో అర్దం కావటం లేదు. కేవలం వైసీపీ అభ్యర్ధి విజయానికి కృషి చేస్తున్నాడన్న ఉక్రోషంతోనే పరమేశ్వరరెడ్డిపై టిడిపి నేతలు దాడులు చేయటం గమనార్హం. ఇంకా విచిత్రమేమిటంటే దాడికి గురైంది, దాడులు చేసిందీ ఇద్దరూ బంధువులే.

ఇదిలావుండగా, వైసీపీ నేతల ఇళ్ళను లక్ష్యంగా చేసుకుని పోలీసులతో కూడా టిడిపి నేతలు దాడులు చేయిస్తున్నారు. ఎన్నికల్లో పంపిణీ చేయించేందుకే  ఇళ్ళల్లో డబ్బులు పెట్టుకున్నారని తమకు సమాచారం వచ్చిందంటూ చెప్పి వైసీపీ నేతల ఇళ్ళను సోదాలు చేస్తున్నారు. వైసీపీ నేతల్లో టిడిపి నేతలకు ఎవరిపై అనుమానముంటే  వారి జాబితాను పోలీసులకు ఇచ్చి మరీ దాడులు చేయిస్తున్నట్లు సమాచారం.

ఇటువంటి దాడుల వల్ల టిడిపికి నష్టమే కానీ లాభం ఏమీ ఉండదన్న కనీస ఇంగితం కూడా ఉండటం లేదు. వైసీపీ ఎంఎల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి బంధువుల ఇళ్ళపై ఈరోజు సాయంత్రం పోలీసులు దాడి చేసి అణువణువు సోదా చేయటం గమనార్హం. పోలీసుల వరస చూస్తుంటే 23 తేదీ తెల్లవారి వరకూ ఇదే విధంగా వైసీపీ నేతల ఇళ్ళపై దాడులు చేసేట్లే కనబడుతోంది. అంటే ఒకవైపు దాడులు చేసి గాయపరుస్తూనే మరోవైపు సోదాల పేరుతో వేధింపులకు టిడిపి నేతలు దిగుతున్నారన్న విషయం అర్దమైపోతోంది.

click me!