
అన్ని జల వనరులను ఒకేసారి పూజించుకునే సరికొత్త ఒరవడికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. నదులు, వాగులు, నీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెక్‌డ్యామ్‌లు, చెరువుల దగ్గర నుంచి పంటకుంటల వరకు ప్రతి జలవనరుకు ప్రణమిల్లే కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ‘జలసిరికి హారతి’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నెలాఖర్లో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించాలని సూచించారు.
గోదావరి, కృష్ణా పుష్కరాల సమయంలో నదులకు హారతి ఇవ్వడం మొదలుపెట్టామని, ప్రకృతితో ప్రతి ఒక్కరు మమేకం కావాలన్నదే తమ ఆకాంక్షని ఆయన చెప్పారు. అందుకే ఏరువాక, వనం-మనం, తాజాగా ‘జలసిరికి హారతి’ వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ‘జలసిరికి హారతి’ జరిగినన్ని రోజులు ఆయా ప్రాంతాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకట్టుకోవాలని అన్నారు. మైనర్ ఇరిగేషన్ సహా పూర్తయిన ప్రాజెక్టులన్నింటినీ ఈ సమయంలోనే ప్రారంభించాలని స్పష్టం చేశారు.
మరిన్ని తాజా వార్తా విశేషాలకోసం క్లిక్ చేయండి