జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు టీడీపీ నేతలు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీమంత్రి అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యలు పవన్ కళ్యాణ్ ను కలిశారు. చంద్రబాబు నాయుడు దీక్షకు మద్దతు పలకాలని కోరారు.
గుంటూరు: ఈనెల 14న మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టనున్న దీక్షకు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. ఇసుక కొరతపై విజయవాడ వేదికగా గురువారం 12 గంటలపాటు దీక్ష చేయనున్నారు చంద్రబాబు నాయుడు.
అందులో భాగంగా దీక్షకు ఇతర పార్టీల సంఘీభావం కోరుతోంది తెలుగుదేశం పార్టీ. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీల మద్దతుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనాయాణను సైతం కలిశారు టీడీపీ నేతలు.
undefined
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు టీడీపీ నేతలు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీమంత్రి అచ్చెన్నాయుడు, వర్ల రామయ్యలు పవన్ కళ్యాణ్ ను కలిశారు. చంద్రబాబు నాయుడు దీక్షకు మద్దతు పలకాలని కోరారు.
చంద్రబాబు నాయుడు దీక్షలో భాగస్వామ్యం కావాలని కోరారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఇరువురు చర్చించారు. అయితే దీక్షలో పాల్గొనే అంశంపై మాత్రం ఎలాంటి ప్రకటన వెలువడ లేదు.
ఇకపోతే ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వేదికగా ఇసుక కొరతను నిరసిస్తూ లాంగ్ మార్చ్ నిర్వహించారు. లాంగ్ మార్చ్ కు జనసేన అన్ని పార్టీల మద్దతు కోరింది. కానీ తెలుగుదేశం, జనసేన పార్టీలు సంఘీభావం ప్రకటించడంతోపాటు వేదిక పంచుకుంది.
తెలుగుదేశం పార్టీ తరపున మాజీమంత్రులు అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రులు పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ లో పాల్గొన్నారు. అయితే మరోమంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం డుమ్మా కొట్టారు. చంద్రబాబు నాయుడు ఆదేశాలను సైతం బేఖాతారు చేశారు.
ఇకపోతే టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి ఆలపాటి రాజా బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. మాజీ సీఎం చంద్రబాబు దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజా సమస్యలపై ఎవరూ పోరాడినా తమ సంఘీభావం ఉంటుందని కన్నా హామీ ఇచ్చారు.
ఇసుక కొరతపై తొలి నుంచి పోరాడుతోంది బీజేపీనే అని ఆలపాటి రాజాకు స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్‌మార్చ్‌కు బీజేపీ సంఘీభావం తెలిపిందని చెప్పారు. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే రెండు సార్లు పొత్తు పెట్టుకుని నష్టపోయామన్నారు. భవిష్యత్‌లోనూ టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఇకపోతే ఇసుక కొరత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న విషయం వాస్తవమన్నారు. అందువల్ల ఏ పార్టీ అయినా సరే ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాడితే తమ సంఘీభావం ఉంటుందే తప్ప పాల్గొనేది లేదని తేల్చి చెప్పేశారు కన్నా లక్ష్మీనారాయణ. మరి పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి
టీడీపీ, చంద్రబాబు అంటరాని వాళ్లు.. 240 కిలోమీటర్లు దూరం: బీజేపీ నేత వ్యాఖ్యలు
చంద్రబాబు ఇసుక దీక్ష... ఇందిరాగాంధీ స్టేడియంలో కాకుంటే అక్కడే...: టిడిపి ఎమ్మెల్సీ