వనజాక్షి పై దాడి మర్చిపోయారా..? వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి

Published : Nov 13, 2019, 11:07 AM IST
వనజాక్షి పై దాడి మర్చిపోయారా..? వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి

సారాంశం

అనారోగ్యంతో మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన కామెంట్స్ ని ఈ సందర్భంగా ఆమె ఖండించారు. 

రాష్ట్రంలో టీడీపీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారని వాటిని మానుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పేర్కొన్నారు.  మంగళవారం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 

AlsoReadశ్రీవారి లడ్డూ ధర రెట్టింపు...

అనారోగ్యంతో మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన కామెంట్స్ ని ఈ సందర్భంగా ఆమె ఖండించారు. చెరుకులపాడులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టీడీపీ నేతలను అడ్డుకున్నందుకే వైసీపీ నాయకుడు, తన భర్త నారాయణ రెడ్డిని, ఆయన అనుచరుడు సాంబశివుడిని పట్టపగలు శ్యాంబాబు హత్య చేయించిన విషయం నారా లోకేష్ తెలుసుకోవాలన్నారు.

Alsoreadఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మేనమామ కారు చోరీ...

గత ప్రభుత్వంలో ఇసుక అక్రమార్కులను అడ్డుకున్నందుకు తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ నేతలు దాడి చేసిన విషయం మర్చిపోయారా అంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశ్నించారు.

పత్తికొండ మండలం కనకదిన్నె గ్రామ మాజీ సర్పంచ్ ట్రాక్టర్ ఇసుక కోసం రూ.1,550 ప్రభుత్వానికి చలానా కట్టి దానితో డూప్లికేట్ సృష్టించి రోజుకి  70 ట్రాక్టర్ల ఇసుకను తరలించి నెలకు రూ.21లక్షలు చొప్పున కాజేసిన విషయం లోకేష్ తెలుసుకోవాలని ఆమె అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధిక వర్షాల వల్ల నదులు నిండి ఇసుక సమస్య తలెత్తిందన్నారు. వర్షాలు తగ్గగానే ఇసుక కొరత ఉండదని ఆమె అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu
Legendary Actor Krishnam Raju 86th Birth Anniversary | Free Mega Diabetes Camp | Asianet News Telugu