రోడ్డు ప్రమాదంలో 14మంది మృతి బాధాకరం: చంద్రబాబు, లోకేష్ దిగ్భ్రాంతి

Arun Kumar P   | Asianet News
Published : Feb 14, 2021, 08:23 AM ISTUpdated : Feb 14, 2021, 09:06 AM IST
రోడ్డు ప్రమాదంలో 14మంది మృతి బాధాకరం: చంద్రబాబు, లోకేష్ దిగ్భ్రాంతి

సారాంశం

కర్నూల్ రోడ్డు ప్రమాదంలో 14మంది మరణించడంపై టిడిపి చీఫ్ చంద్రబాబు, మాజీ మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

కర్నూల్: ఆదివారం తెల్లవారుజామున కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 14మంది మృతిచెందారు. వెల్దుర్తి సమీపంలో జరగిన ఈ రోడ్డు ప్రమాద ఘటనపై మాజీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆద్యాత్మిక యాత్రకు వెళుతున్నవారు ఇలా రోడ్డు ప్రమాదానికి గురవడం... వారిల 14మంది చనిపోయవడం కలచి వేసిందన్నారు. ఏపీలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు అదికమయ్యాయని... వాటి నివారణను ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. 

ఈ ప్రమాదంలో తీవ్రగా గాయపడిని చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని చంద్రబాబు సూచించారు.  

read more   కర్నూల్ లో ఘోర రోడ్డుప్రమాదం... దైవదర్శనానికి వెళుతూ 14 మంది మృతి

ఇక మాజీ మంత్రి, టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ ప్రమాదంపై స్పందించారు.  రోడ్డు ప్రమాద ఘటన దారుణమని... 14మంది మృతి తీవ్రంగా కలచివేసిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ వారిని కోల్పోయిన తీవ్ర దు:ఖంలో వున్న కుటుంబాలకు లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సహాయం అందించాలని లోకేష్ సూచించారు.  

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu