పంచాయతీలో షాక్: కొడాలి నాని స్వగ్రామంలో టీడీపీ మద్దతుదారు విజయం

By telugu teamFirst Published Feb 14, 2021, 8:12 AM IST
Highlights

ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. కొడాలి నాని స్వగ్రామంలో టీడీపీ మద్దతుదారు అనూష ఘన విజయ సాధిచారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

విజయవాడ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల మంత్రి కొడాలి నానికి షాక్ తగిలింది. కొడాలి నాని స్వగ్రామం, అత్తవారి గ్రామమైన కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామంలో వైసీపీ మద్దతుదారు ఓటమి పాలయ్యారు. 

పామర్రు నియోజకవర్గంలో ఉన్న ఆ గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ మద్దతుదారు విజయం సాధించారు. శనివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారు కొల్లూరి అనూషకు 1322 ఓట్లు రాగా, వైసీపీ బలపరిచిన తుమ్పూడి దేవణికి 1,052 ఓట్లు వచ్చాయి. దీంతో అనూష 271 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

దాంతో యలమర్రులో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం ఆలింగనం చేసుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. గ్రామంలో బాణసంచా కాల్చారు. అనూషను గ్రామంలో ఊరేగించారు. 

ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ రెండో దశ ఎన్నికలు శనివారం జరిగాయి. పోలింగ్ తర్వాత ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఓట్ల లెక్కింపులో యలమర్రు గ్రామ సర్పంచ్ గా అనూష విజయం సాధించారు. 

click me!