టీడీపీ, వైసీపీ ఛాలెంజ్... మధ్యలో బాలయ్య

Published : Aug 06, 2018, 03:18 PM IST
టీడీపీ, వైసీపీ ఛాలెంజ్... మధ్యలో బాలయ్య

సారాంశం

ఆ మెజార్టీని వచ్చే ఎన్నికల్లో బాలయ్య  దాటేస్తారని టడీపీ నేతలు ఉన్నారు.   

అనంతపురం జిల్లా హిందూపురం టౌన్ టీడీపీ నేతలు వైసీపీ నేతలకు ఛాలెంజ్ విసిరారు. గత ఎన్నికల్లో బాలకృష్ణ.. హిందూపురం ఎమ్మెల్యే పదవికి టీడీపీ నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. కాగా ఆ మెజార్టీని వచ్చే ఎన్నికల్లో బాలయ్య  దాటేస్తారని టడీపీ నేతలు ఉన్నారు. 

గత ఎన్నికల్లో హిందూపురం పట్టణంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు వచ్చిన మెజార్టీ కంటే రాబోయే ఎన్నికల్లో తగ్గితే హిందూపురం వదులుతామని టీడీపీ నాయకులు నాగరాజు అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో విలేకరులతో మాట్లాడారు. శనివారం పురం వైసీపీ ఇన్‌చార్జ్‌ నవీన్‌నిశ్చల్‌ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ నాలుగు నెలలుగా నవీన్‌నిశ్చల్‌కు మతిభ్రమించి హిందూపురంలో జరుగుతున్న అభివృద్ధి చూడలేక అలా మాట్లాడుతున్నాడన్నారు. పదేళ్లలో కాంగ్రెస్‌ హయాంలో హిందూపురంలో ఎన్ని రోడ్లు అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు.
 
నాలుగేళ్ల కాలంలో పట్టణంలో బండిమోట్‌, ఎన్టీఆర్‌ సర్కిల్‌ చిన్నమార్కెట్‌ వద్ద రోడ్డు వెడల్పు చేశామన్నారు. త్వరలోనే రైల్వే రోడ్డుకూడా విస్తరణ పనులు చేపడతామన్నారు. రూ.194కోట్లతో పైప్‌లైన్‌, 23కోట్లతో మార్కెట్‌, 66కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఐదు నెలలోపే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇంటింకీ కొళాయి పనులను ప్రారంభిస్తామన్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్