గుంటూరు: టీడీపీ- వైసీపీ బాహాబాహీ, మోదుగుల వాహనం ధ్వంసం

By Siva Kodati  |  First Published Mar 10, 2021, 8:54 PM IST

మున్సిపల్ ఎన్నికల వేళ గుంటూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ ముగిసే సమయంలో టీడీపీ- వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోలింగ్ బాక్స్‌ను పగులగొట్టాడని ఆందోళనకు దిగాయి టీడీపీ శ్రేణులు


మున్సిపల్ ఎన్నికల వేళ గుంటూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ ముగిసే సమయంలో టీడీపీ- వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోలింగ్ బాక్స్‌ను పగులగొట్టాడని ఆందోళనకు దిగాయి టీడీపీ శ్రేణులు.

అలాగే 42వ డివిజన్ టీడీపీ అభ్యర్ధిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ మోదుగుల కార్లపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో కార్లు ధ్వంసమయ్యాయి. పోలీసులు కలగజేసుకున్నా పరిస్ధితి సద్ధుమణగలేదు.

Latest Videos

undefined

ధ్వంసమైన కార్ల వద్దకు వైసీపీ- టీడీపీ శ్రేణులు భారీగా మోహరించడంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది. ముందు జాగ్రత్త చర్యగా అదనపు బలగాలను మోహరించారు. దీనిపై స్పందించిన మోదుగుల.. దొంగ ఓట్లను ప్రశ్నించినందుకే దాడి చేశారని ఆరోపించారు.

విద్యార్ధినులు, మహిళలతో టీడీపీ దొంగ ఓట్లు వేయించిందని మోదుగుల వ్యాఖ్యానించారు. తనను లక్ష్యంగా చేసుకునే దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ.. ప్రశాంతమైన వాతావరణంలో గుంటూరు కార్పోరేషన్ ఎన్నికలు జరిగాయని తెలిపారు.

15 సంవత్సరాల తరువాత జరుగుతున్న ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు తప్పపెద్ద వివాదాలు చోటు చేసుకోలేదని అమ్మిరెడ్డి వెల్లడించారు. 42వ వార్డులో పేక్ ఓటింగ్ జరుగుతుందని సాయంత్రం 4:30 తరువాత రెండు వర్గాలు అక్కడికి భారీగా చేరుకున్నాయని ఎస్పీ  తెలిపారు.

వైసీపీ నేతలు టీడీపీ  అభ్యర్థిపై దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. ఆగ్రహనికి గురైన టీడీపీ కార్యకర్తలు, వైసీపీకి సంబంధించిన కార్లపై దాడి చేశారని ఎస్పీ చెప్పారు. ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశామని అమ్మిరెడ్డి వెల్లడించారు.

click me!