స్పీకర్ గా తమ్మినేని.. టీడీపీ అభ్యంతరం

By telugu teamFirst Published Jun 13, 2019, 10:13 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరగగా... రెండో రోజు అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరిగింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయ్యాయి. తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరగగా... రెండో రోజు అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ గా తమ్మినేని సీతారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే... ఈ స్పీకర్ ఎన్నికపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అధికార పార్టీకి బలమున్నా... ప్రతి పక్ష పార్టీకి సమాచారం ఇవ్వడం సంప్రదాయమని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి సమాచారం ఇచ్చామని ఈ సందర్భంగా టీడీపీ నేతలు గుర్తు చేశారు. స్పీకర్ బాధ్యతల సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించే యోచనలో టీడీపీ నేతలు ఉన్నారు. 

ఇదిలా ఉండగా.. స్పీకర్ గా ఎన్నికైన తమ్మినేని సీతారాంకి ఎంతో అనుభవం ఉంది. ఆయన ఆరుసార్లు ఆముదాల వలస నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకే ఆ పదవిని జగన్ అప్పగించారు.

click me!