అది లోకేష్ ఛాంబర్... నాకు వద్దు.. మంత్రి పెద్దిరెడ్డి

Published : Jun 13, 2019, 09:14 AM IST
అది లోకేష్ ఛాంబర్... నాకు వద్దు.. మంత్రి పెద్దిరెడ్డి

సారాంశం

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. అత్యధిక మెజార్టీ సాధించిన ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్... తన మంత్రి వర్గంలో 25మందికి చోటు కల్పించారు.

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. అత్యధిక మెజార్టీ సాధించిన ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్... తన మంత్రి వర్గంలో 25మందికి చోటు కల్పించారు. వారిలో పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి కూడా ఉన్నారు. కాగా..  ఆయనకు రాష్ట్ర గనులు, పంచాయతీరాజ్ శాఖ కేటాయించారు.

ఇటీవల మంత్రులు కూడా బాధ్యతలు చేపట్టగా... వారికి ఏపీ సచివాలయంలో స్పెషల్ ఛాంబర్లు కేటాయించారు. అయితే... తనకు కేటాయించిన ఛాంబర్ తనకు వద్దని మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తేల్చి చెప్పారు.

ఆయనకు తొలుత సచివాలయంలో ఐదో బ్లాక్‌లో చాంబర్‌ కేటాయించారు. గతంలో నారా లోకేష్‌ అదే చాంబర్‌ నుంచి పనిచేశారు. ఈ విషయం తెలుసుకున్న పెద్దిరెడ్డి... ఆ చాంబర్‌ తనకు వద్దన్నారని తెలిసింది. దీంతో... ఆయనకు వేరే ఛాంబర్ కేటాయించారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్