తల్లిని అవమానించినోళ్లను లోకేష్ విడిచిపెట్టడు... ప్యాంట్లు తడవడం ఖాయం : యరపతినేని వార్నింగ్

Published : Jul 06, 2023, 01:46 PM IST
తల్లిని అవమానించినోళ్లను లోకేష్ విడిచిపెట్టడు... ప్యాంట్లు తడవడం ఖాయం : యరపతినేని వార్నింగ్

సారాంశం

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ప్రజలకు దగ్గరవడం చూసి వైసిపి నాయకులు, కార్యకర్తల్లో గుబులు మొదలయ్యిందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని అన్నారు. 

అమరావతి : తన కన్నతల్లిని అవమానించిన వారిని నారా లోకేష్ వదిలిపెట్టబోరని టిడిపి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు.అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గురించి వైసిపి సభ్యులు అవమానకరంగా మాట్లాడటం తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందన్నారు. హుందాగా వ్యవహరించాల్సిన సభలో తన తల్లిని అవమానించిన వారిపై లోకేష్ వేటుపడక తప్పదని యరపతినేని హెచ్చరించారు. 

నారా లోకేష్ తాత ఎన్టీఆర్ తో పాటు కన్నతండ్రి చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసారని... ఆయన గోల్డెన్ స్పూన్ తో పుట్టారని యరపతినేని పేర్కొన్నారు.కానీ తాత, తండ్రి బాటలోనే నడుస్తూ ప్రజాసేవ చేయాలనే లోకేష్ రాజకీయాల్లోకి వచ్చారన్నారు. లోకం తెలియనివాడంటూ గతంలో ఎద్దేవా చేసినవారి లోకల్ ప్లేస్ కు వెళ్లిమరీ లోకేష్ నిద్రపోనివ్వకుండా చేస్తున్నాడని అన్నారు. మైక్ తీసేస్తే స్టూల్ ఎక్కి మాట్లాడాడు... నడవకుండా అడ్డుకుంటే రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. ఇలా ఇప్పటివరకు యువగళం పేరిట 1900కిలోమీటర్లు నడిచారని అన్నారు.లోకేశ్ నడుస్తుంటే వైసీపీ నేతలు, కార్యకర్తల ప్యాంట్లు తడిసిపోతున్నాయని యరపతినేని అన్నారు.

 ఉగ్రనరసింహుడిలా ఉన్న లోకేశుడిని చూసి వైసీపీ నాయకులకు నిద్ర కరువైందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలాకా కడపలో లోకేష్ దుమ్ములేపుతూ విజయవంతంగా పాదయాత్ర ముగించారని అన్నారు. లోకేష్ ఉగ్రరూపం చూసి వైసిపి నాయకులు, కార్యకర్తలకు నిద్రపట్టడం లేదని యరపతినేని అన్నారు.

Read More  మంత్రి అంబటికి బిగ్ షాక్... టిడిపిలో చేరిన మంత్రి ప్రధాన అనుచరుడు 

రాష్ట్రానికి మంచి చేయాలన్న లోకేష్ కసి, పట్టుదల ప్రజలకు అర్థమైంది కాబట్టే ఆయన్ని అక్కున చేర్చుకుంటున్నారని అన్నారు. అప్పులఊబిలో చిక్కుకున్న రాష్ట్రాన్ని గట్టెక్కించడం కోసం ప్రజలంతా చంద్రబాబుతో కలిసినడవాల్సిన సమయం వచ్చిందన్నారు. జగన్ నొక్కే బటన్లేవీ ఆయనను కాపాడలేవని... భవిష్యత్తులో ప్రజలునొక్కే బటన్ తో సైకో శాశ్వతంగా రాష్ట్రానికి దూరమవుతాడని యరపతినేని పేర్కొన్నారు. 

తాజాగా ముఖ్యమంత్రి జగన్ డిల్లీ పర్యటనపైనా యరపతినేని స్పందించారు. ప్రజల్లో రోజురోజుకు తనపై నమ్మకం తగ్గుతోందని... అందువల్లే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో జగన్ వున్నారని అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించేందుకే జగన్ డిల్లీకి వెళ్లారని అన్నారు. కానీ ఎన్నికలు ఎప్పుడుజరిగినా జగన్ రెడ్డి ఇంటికెళ్లడం ఖాయమని అన్నారు. కాబట్టి సైకోను నమ్మి నిబంధనలకు విరుద్ధంగా పనిచేసే అధికారులు ఎంతటివారైనా తగినమూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!