ఒక్కరోజులో ఏం మాట్లాడతారు, ఏం చర్చిస్తారు... అందుకే అసెంబ్లీ బహిష్కరణ: యనమల

By Siva KodatiFirst Published May 18, 2021, 5:45 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తూ తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. బడ్జెట్‌పై చర్చ జరగకుండా సమావేశాలు ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి లేనప్పుడు ఏం చేశారని యనమల ప్రశ్నించారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తూ తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. బడ్జెట్‌పై చర్చ జరగకుండా సమావేశాలు ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి లేనప్పుడు ఏం చేశారని యనమల ప్రశ్నించారు.

అప్పుడు ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరమేంటని నిలదీశారు. కేసులు, అరెస్ట్‌లపైనా చర్చ జరగాల్సి వుందని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని పొడిగించుకోవడానికే అసెంబ్లీ సమావేశమని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అనేక సమస్యలపై చర్చ జరగాల్సి వుందని... కరోనా సహా పలు తీవ్ర సమస్యలు వున్నాయని యనమల అన్నారు.

ఆందోళనతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం సరికాదని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. 2 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు వున్న సమయంలో ఆయన అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. 

Also Read:ఏపీ: అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ దూరం.. చంద్రబాబు కీలక నిర్ణయం

మరోవైపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20న ప్రారంభం కానున్నాయి. ఒక్క రోజు మాత్రమే  అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం  నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది జూన్ రెండో వారంలో  అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

దీంతో ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరపాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. అదే రోజున ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. కరోనా నేపథ్యంలో ఒక్క రోజే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలనే యోచనలో జగన్ ప్రభుత్వం ఉంది.

ఈ నెల 20వ తేదీన ఉదయం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఆ వెంటనే బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.38 లక్షల కోట్ల మధ్యలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు మాసాల బడ్జెట్‌కు ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. 

click me!