ఏపి సిఐడి డిజి సునీల్ కుమార్ పై దేశద్రోహం కేసు..: డిజిపికి వర్ల రామయ్య డిమాండ్

By Arun Kumar PFirst Published Jun 17, 2021, 2:50 PM IST
Highlights

 భారత సాంప్రదాయాన్ని కించపరుస్తూ, బ్రిటిష్ వారిని స్తుతించిన సిఐడి డిజి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య రాష్ట్ర డిజిపిని కోరారు. 

అమరావతి:  సిఐడి అడిషనల్ డైరెక్టర్ జనరల్ పి.వి సునీల్ కుమార్, కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ కు వర్ల ఓ లేఖ రాశారు. 

 భారత సాంప్రదాయాన్ని కించపరుస్తూ, బ్రిటిష్ వారిని స్తుతించిన సిఐడి డిజి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉగ్రవాదరీతిలో ఆత్మార్పణకు సిద్ధపడాలని దళిత యువతను ఉద్రేకపరుస్తున్నాడని ఆరోపించారు. సమాజంలో రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రేకెత్తించే రీతిలో ఉపన్యాసాలిస్తున్న సునీల్ కుమార్ కు కేసు నమోదు చేయాలని వర్ల డిజిపిని కోరారు. 

read more  కర్నూల్ టిడిపి నేతల హత్యల వెనుక... వైసిపి ఎమ్మెల్యే కాటసాని హస్తం?: అచ్చెన్నాయుడు సంచలనం

ఇక అమెరికాలో వరల్డ్  ట్రేడ్ సెంటర్ ను కూల్చిన ఉగ్రవాదులను ఆదర్శంగా తీసుకోవాలని దళిత యువతను ఉద్రేకపరుస్తున్న కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబును కూడా శిక్షించాలని వర్ల డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా వుంటూ, సర్వీస్ కాండక్ట్ రూల్స్ ను ఉల్లంఘించిన ఈ ఇద్దరు అధికారులపై వెంటనే చర్య తీసుకోవాలని వర్ల రామయ్య కోరారు.

భారత శిక్షాస్మృతి 124(A)ప్రకారం వీరిపై రాజద్రోహ నేరం కేసు రిజిస్టర్ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వర్ల డిజిపికి సూచించారు. అంతేకాకుండా 153(A),295(A) ఐపిసి ప్రకారం కూడా వీరిద్దరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిజిపికి రాసిన లేఖలో వర్ల రామయ్య పేర్కొన్నారు.

click me!