మీ బకాయిలు మేం కట్టాం.. 48 గంటల్లో రైతులకు చెల్లింపులు చేశారా: బాబుకు సజ్జల కౌంటర్

By Siva KodatiFirst Published Jun 17, 2021, 2:46 PM IST
Highlights

చంద్రబాబు లేఖపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన .. ప్రభుత్వంపై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు.

చంద్రబాబు లేఖపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన .. ప్రభుత్వంపై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో 48 గంటల్లో రైతులకు చెల్లింపులు జరిగాయా అని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికలకు ముందు ఆయన నిధులను వేరే కార్యక్రమాలకు వినియోగించారని సజ్జల ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొక్యూర్‌మెంట్ బకాయిలను జగన్ చెల్లించారని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. జగన్ పాలనలో రైతుల్లో విశ్వాసం పెరిగిందని ఆయన స్పష్టం చేశారు. 2014-15లో 18 లక్షల 91 టన్నులు, 15-16లో 21 లక్షల టన్నులు, 16-17లో 16 లక్షల 95 వేల టన్నులు, 17-18లో 18 లక్షల టన్నులు, 18-19లో 27 లక్షల 52 వేల టన్నుల ప్రొక్యూర్‌మెంట్ జరిగిందన్నారు. 19-20లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 34 లక్షలకు టన్నుల్ని ప్రొక్యూర్‌ చేశామని గుర్తుచేశారు.

Also Read:సీఎం గారూ... మీ పాలనలో రైతుల కష్టాలివీ...: జగన్ కు చంద్రబాబు లేఖ

20-21లో రబీ సీజన్‌లో ఇప్పటి వరకు 25 లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని ప్రొక్యూర్ చేశామని.. మొత్తం లక్ష్యం 45 లక్షల టన్నులని సజ్జల తెలిపారు. చంద్రబాబు పెట్టి వెళ్లిన బకాయిలన్నింటినీ తమ ప్రభుత్వం చెల్లిస్తూ వచ్చిందని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 

click me!