కోర్టు దిక్కరణ... అదీ శ్రీవారి సన్నిధిలో...: స్పీకర్ తమ్మినేనిపై వర్ల ధ్వజం

Arun Kumar P   | Asianet News
Published : Jul 02, 2020, 07:34 PM IST
కోర్టు దిక్కరణ... అదీ శ్రీవారి సన్నిధిలో...: స్పీకర్ తమ్మినేనిపై వర్ల ధ్వజం

సారాంశం

 ప్రభుత్వ నిర్ణయాలకు స్పీకర్ తమ్మినేని సీతారాం వత్తాసు పలకడం ప్రభుత్వం తరఫునా, వ్యక్తిగతమా, శాసనసభ ఉదేశ్యమా, ప్రభుత్వ నిర్దేశమా తేల్చి చెప్పాలని టిడిపి  పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. 

విజయవాడ:  ప్రభుత్వ నిర్ణయాలకు స్పీకర్ తమ్మినేని సీతారాం వత్తాసు పలకడం ప్రభుత్వం తరఫునా, వ్యక్తిగతమా, శాసనసభ ఉదేశ్యమా, ప్రభుత్వ నిర్దేశమా తేల్చి చెప్పాలని టిడిపి  పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఆర్థిక బిల్లును మండలి అడ్డుకున్న చరిత్ర ప్రపంచంలో లేదంటూ స్పీకర్ వ్యాఖ్యానించడం తగదన్నారు. తిరుమలలో కలియుగ దైవం ఏడుకొండల వారి సన్నిధిలో స్పీకర్ తమ్మినేని మండలిలో జరిగిన అంశంపై రాజకీయంగా మాట్లాడి చట్టసభల నిబంధనలను ఉల్లంఘించారని వర్ల అన్నారు. 

''శాసనసభకు స్పీకర్ గా ఉంటూ మరో చట్ట సభను కించ పరచడం డాక్టర్  బాబా సాహెబ్  అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానించినట్లే.  ప్రజా సంక్షేమ పథకాలపై పార్టీలు విమర్శలు చేయడం సరికాదన్న స్పీకర్ తమ్మినేని చట్టసభల పరిధిని గుర్తించి మసలు కోవాలి.  ప్రభుత్వ నిర్ణయాలకు స్పీకర్ వత్తాసు పలకడం ప్రభుత్వం తరఫునా, వ్యక్తిగతమా, శాసనసభ ఉదేశ్యమా, ప్రభుత్వ నిర్దేశమా తేల్చి చెప్పాలి'' అని మరోసారి నిలదీశారు. 

read more    ఇక ప్రభుత్వాలు ఎందుకు?:కోర్టులపై స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

'' న్యాయవ్యవస్థపై వ్యాఖ్యానించే ముందు ఏ వ్యవస్థ వ్యక్తిత్వం ఆ వ్యవస్థకు రాజ్యాంగంలో పొందు పరచడాన్ని గౌరవించాలి.  రాజ్యాంగ వ్యవస్థల్లోని లోపాలను ఎత్తి చూపే అవకాశం జ్యుడీషియల్ వ్యవస్థకు అప్పగించారు. 1975లో అమేధీ నియోజకవర్గంలో గెలిచి ప్రధాని పదవిని స్వీకరించిన ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పిన ఘనత అలహాబాద్ హైకోర్టుకు ఉంది. అంత ప్రాధాన్యమున్న జ్యుడీషియల్ వ్యవస్థపై వ్యాఖ్యానించినందుకు కంటెప్ట్ ఆఫ్ కోర్టు కింద కు వస్తుంది. తమ్మినేని జ్యుడీషియల్ వ్యవస్థకు క్షమాపణ చెప్పాలి'' అనివర్ల రామయ్య సూచించారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే