ఉద్యోగులకు జీతాలు రాకపోవడానికి టీడీపీయే కారణం: ఏపీ ఎన్‌జీవో అధ్యక్షుడు

Published : Jul 02, 2020, 05:42 PM IST
ఉద్యోగులకు జీతాలు రాకపోవడానికి టీడీపీయే కారణం: ఏపీ ఎన్‌జీవో అధ్యక్షుడు

సారాంశం

ఉద్యోగులకు జీతాలు రాకపోవడానికి  టీడీపీ ఎమ్మెల్సీలే కారణమని ఏపీ ఎన్ జీ వో అధ్యక్షుడు ఎన్. చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఏపీ శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు పాస్  కాకపోవడం వల్లే ఉద్యోగులకు జీతాలు రాకుండా పోయాయన్నారు. 


అమరావతి: ఉద్యోగులకు జీతాలు రాకపోవడానికి  టీడీపీ ఎమ్మెల్సీలే కారణమని ఏపీ ఎన్ జీ వో అధ్యక్షుడు ఎన్. చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఏపీ శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు పాస్  కాకపోవడం వల్లే ఉద్యోగులకు జీతాలు రాకుండా పోయాయన్నారు. 

గురువారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు జీతాలు రాకపోవడానికి ఉద్యోగుల ఉసురు టీడీపీ ఎమ్మెల్సీలకు తగులుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు రావాలి. కానీ, జీతాలు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. 

కరోనా నేపథ్యంలో మూడు నెలలకు ఆర్డినెన్స్ తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారు.. పది లక్షల మంది ఉద్యోగులు పెన్సర్స్ జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారని ఆయన చెప్పారు. 

also read:ఉద్యోగులకు జీతాలు నిలిచిపోవడానికి టీడీపీయే కారణం: తమ్మినేని సీతారాం

యాబై ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఇలా మండలిలో జరగలేదు.. మాజీ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కౌన్సిల్ లో ఉండి కూడ ఉద్యోగులకు మేలు జరలేదన్నారు..ఉద్యోగులకు నష్టం జరుగుతుందని తెలిసి కూడ ఆశోక్ బాబు ద్రవ్య వినిమయ బిల్లును అడ్డుకొన్నారని ఆయన విమర్శించారు.

గత మాసంలో శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు పాస్ కాలేదు. ఈ బిల్లు పాస్ కాకుండానరే మండలి నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే