మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్రపన్నారని.. ఈ మేరకు రెక్కీ కూడా నిర్వహించారంటూ ఆయన ఆరోపణలు చేశారు. రెక్కీ నిర్వహించింది ఎవరో త్వరలో తెలుస్తుందని రాధా చెప్పారు. అలాంటి వ్యక్తులను దూరం పెట్టాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్రపన్నారని.. ఈ మేరకు రెక్కీ కూడా నిర్వహించారంటూ ఆయన ఆరోపణలు చేశారు. రెక్కీ నిర్వహించింది ఎవరో త్వరలో తెలుస్తుందని రాధా చెప్పారు. అలాంటి వ్యక్తులను దూరం పెట్టాలని ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు. రంగా కీర్తి, ఆశయాల సాధనే తన లక్ష్యమన్నారు. పదవులపై తనకు ఎలాంటి ఆశ లేదని.. తనను పొట్టన పెట్టుకోవాలని అనుకునేవారికి భయపడేది లేదని వంగవీటి రాధా స్పష్టం చేశారు. తాను ప్రజల మధ్యే వుంటానని, నన్ను లేకుండా చేయాలనుకునే వారిని ప్రజలు దూరం పెట్టాలని రాధా పిలుపునిచ్చారు.
అంతకుముందు దివంగత కాపు నాయకుడు వంగవీటి మోహనరంగా 33వ వర్ధంతి (vangaveeti vardhanthi) సందర్భంగా ఎమ్మెల్యే వంశీ తన మిత్రుడు, వంగవీటి రాధా (vangaveeti radha)ను కలిసారు. ఇద్దరూ కలిసి బెజవాడలోని రాఘవయ్య పార్క్ దగ్గర ఉన్నటువంటి రంగా విగ్రహానికి పూలమల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో జనసేన పార్టీ (janasena party) నాయకులు పోతిన మహేష్ కూడా పాల్గొన్నారు. తమ ప్రియతమ నాయకుడు రంగా వర్ధంతి సందర్భంగా రాధ ఇంటి వద్దకు అభిమానులు భారీగా చేరుకోవడంతో సందడి నెలకొంది.
undefined
Also Read:ఆ ఘనత ఎన్టీఆర్, వైఎస్సార్, వంగవీటి రంగాదే...: Vangaveeti Ranga Vardhathi సభలో వల్లభనేని వంశీ
ఈ సందర్బంగా ఎమ్మెల్యే వంశీ మాట్లాడుతూ... గొప్ప నాయకుడు వంగవీటి రంగా బిడ్డలమని చెప్పడానికి తాము గర్వపడుతున్నామన్నారు. తండ్రి బాటలోనే వంగవీటి రాధ కూడా అంతే ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వంశీ పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో చనిపోయిన తర్వాత కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్న నాయకులు, చిరకాలం గుర్తుండే వ్యక్తులు ముగ్గురే ముగ్గురు... వారు దివంగత ముఖ్యమంత్రులు నందమూరి తారక రామారావు (NTR), వైఎస్ రాజశేఖరరెడ్డి (YSR) తో పాటు వంగవీటి మోహన రంగా (Vangaveeti Ranga) అని వల్లభనేని వంశీ (vallabhaneni vamsi) పేర్కొన్నారు.
ఇక వంగవీటి రాధ మాట్లాడుతూ... వంగవీటి కుటుంబాన్ని ఆదరిస్తున్నటువంటి ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అన్నారు. గత 33సంవత్సరాలుగా నాన్న వర్ధంతిని ఆయన అభిమానులే జరపుతున్నారు. ఆయనపై ప్రజల అభిమానం చూసి తనకు చాలా సంతోషం వేస్తోందని రాధ పేర్కొన్నారు. గొప్ప ఆశయ సాధన కోసం పోరాడిన వ్యక్తి వ్యక్తి వంగవీటి రంగా అని కొనియాడారు.