ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు ఆదివారం నాడు సన్మానం చేశారు. ఏపీ రాష్ట్ర హైకోర్టులో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అమరావతి:న్యాయవాదులు సమాజానికి మార్గదర్శకులని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.AP High court Bar అసోసియేషన్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ NV Ramana దంపతులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. ప్రజల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
సమాజ శ్రేయస్సు కోసం న్యాయవాదులు తమ శక్తియుక్తులను ఉపయోగించాలన్నారు.హైకోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. అంతే కాదు న్యాయమూర్తుల కొరత కూడా ఉందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పారు. అయితే వీటి సమస్య కోసం పరిష్కరించే ప్రయత్నిస్తామన్నారు. వీలైనంత త్వరలోనే న్యాయమూర్తుల కొరతను తీర్చనున్నట్టుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తెలిపారు
ఏపీలోని విజయవాడ కానూరు సిద్ధార్థ కళాశాలలో జరిగిన లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస సభలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సభలో సీజేఐ భారత న్యాయవ్యవస్థ భవిష్యత్తు సవాళ్లు అంశంపై ప్రసంగించారు.
ఇటీవలి కాలంలో జ్యుడీషియల్ అధికారులపై భౌతిక దాడులు పెరుగుతున్నాయని, పార్టీలకు అనుకూలమైన ఉత్తర్వులు రాకపోతే న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో ఆసత్య ప్రచారాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు స్వతంత్రంగా వ్యవహరించాలన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించలేకపోతోందని అన్నారు. పీపీల నియామకంలో ప్రత్యేకంగా స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, వారు కోర్టులకు మాత్రమే జవాబుదారీగా ఉండాలని పేర్కొన్నారు.
న్యాయవ్యవస్థపై జరిగే ద్వేషపూరిత దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని, కోర్టు జోక్యం చేసుకుని ఉత్తర్వులు జారీ చేస్తే తప్ప అధికారులు సాధారణంగా దర్యాప్తును కొనసాగించకపోవడం దురదృష్టకరమని సీజేఐ అన్నారు. చట్టాల రూపకల్పనలోనే తరువాత తలెత్తే సమస్యలను సమర్థవంతమైన పరిష్కారడానికి.. అనుకునంగా మార్పులు చేసుకునేలా చట్టాలను రూపొందించాలని అన్నారు.
also read:న్యాయవ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది: CJI NV RAMANA
ఈ క్రమంలో 2016లో తీసుకోవచ్చిన బీహార్ ప్రొహిబిషన్ యాక్ట్‌ను ఉటంకించారు. దేశవ్యాప్తంగా 4.60 లక్షలు కేసులు సుప్రీంకోర్టుల్లో పెండింగులో ఉన్నాయి. ఒక మిలియనుకు 21 మంది జడ్జీలు మాత్రమే ఉన్నారు . ఈ పెండింగ్ కేసులో దాదాపు 46 శాతం కేసులు ప్రభుత్వాలకు సంబంధించినవే అన్నారు. వాటిల్లో ఎక్కువగా భూ సంబంధిత వ్యవహారాలే ఉంటున్నాయి అని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ లావు నాగేశ్వరరావు , జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, జస్టిస్ పి.ఎస్ నరసింహ, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పాల్గొన్నారు