ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్రజాతీర్పు వైకాపా సర్కారుకు చెంపపెట్టు లాంటిది : టీడీపీ నేత సోమిరెడ్డి

By Mahesh RajamoniFirst Published Mar 19, 2023, 4:58 AM IST
Highlights

Kadapa: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగించింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గాల్లో విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలోనే టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు సోమిరెడ్డి స్పందిస్తూ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై విమ‌ర్శ‌లు గుప్పించారు. 
 

TDP senior leader Somireddy Chandramohan Reddy: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి క్రూర రాజకీయాలు మానుకుని రాష్ట్రాన్ని సక్రమంగా పాలించాలని మాజీ మంత్రి,  తెలుగు దేశం పార్టీ (టీడీపీ) వైఎస్సార్ జిల్లా ఇన్చార్జి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గాల్లో విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలోనే టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు సోమిరెడ్డి స్పందిస్తూ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై విమ‌ర్శ‌లు గుప్పించారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయనీ, రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీట్  అవుతుంద‌ని పేర్కొన్నారు. రాష్ట్రం జగన్ కు జాగీర్ కాదనీ, ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ప్రజలకు బాగా తెలుసున‌ని చెప్పారు. తగిన సమయంలో అధికార వైకాపాకు, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 సీట్లు సాధించి ప్రతిపక్షం లేకుండా పాలన చేస్తామని గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైకాపాకు ఘోర ప‌రాభవం తప్ప‌దంటూ సోమిరెడ్డి విమ‌ర్శించారు. 

2024 ఎన్నికల్లో టీడీపీ 155 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్య‌క్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని జోస్యం చెప్పారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 108 అసెంబ్లీ సెగ్మెంట్ల ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు హక్కును వినియోగించుకున్నార‌ని చెప్పారు. గత నాలుగేళ్లలో ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఈ ప్రజాతీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చి మెరుగైన పాలన అందిస్తామని సోమిరెడ్డి  పేర్కొన్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ,  పశ్చిమ రాయలసీమ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డిపై టీడీపీ అభ్యర్ధి భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి 7,543 ఓట్ల ఆధిక్యంతో పశ్చిమ రాయలసీమలో గెలిచారు. తూర్పు రాయలసీమ నుంచి తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్య‌ర్థి కంచర్ల శ్రీకాంత్ ఘనవిజయం సాధించారు.  అటు ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలోనూ టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు భారీ విజయం సాధించారు. విజయానికి అవసరమైన ఓట్లలో 90 శాతాన్ని టీడీపీ అభ్యర్థి చిరంజీవి రావు తొలి ప్రాధాన్యంలోనే సాధించారు.
 

click me!