ఫేస్‌బుక్‌లో అసభ్య రాతలు: పోలీసులకు టీడీపీ నేత యామిని శర్మ ఫిర్యాదు

Published : Jun 10, 2019, 01:56 PM IST
ఫేస్‌బుక్‌లో అసభ్య రాతలు: పోలీసులకు టీడీపీ నేత యామిని శర్మ ఫిర్యాదు

సారాంశం

 తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ‌ఖాతాలను సృష్టించి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని టీడీపీ నేత సాధినేని యామిని శర్మ ఆరోపించారు. ఈ మేరకు విమెన్ ప్రొటెక్షన్ ఎస్పీకి సోమవారం నాడు ఫిర్యాదు చేశారు.


విజయవాడ:  తన పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ‌ఖాతాలను సృష్టించి అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని టీడీపీ నేత సాధినేని యామిని శర్మ ఆరోపించారు. ఈ మేరకు విమెన్ ప్రొటెక్షన్ ఎస్పీకి సోమవారం నాడు ఫిర్యాదు చేశారు.

తాను రెండు ఫేస్ బుక్ ఖాతాలను నిర్వహిస్తున్నట్టుగా  సాధినేని యామిని శర్మ చెప్పారు. కానీ, తన పేరున కొన్ని నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలను సృష్టించారని ఆమె ఆరోపించారు. ఈ విషయం తన దృష్టికి ఈ ఏడాది మార్చిలో వచ్చిందన్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు.

కానీ రెండు రోజులుగా  ఇతర పార్టీలపై తన పేరుతో తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఆమె  ఆరోపించారు.  ఈ విషయమై రెండు రోజులుగా తనకు ఫోన్ చేసి దూషిస్తున్నారని ఆమె చెప్పారు.

ఈ విషయమై నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం నాడు విమెన్ ప్రొటెక్షన్ ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు. ఈ విషయమై సీఎం జగన్‌కు లేఖ రాసినట్టుగా ఆమె  గుర్తు చేశారు. మరో వైపు ఈ విషయమై జగన్‌ను కలిసి వివరించనున్నట్టు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?