
TDP leader Pattabhiram: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. విజయవాడలోని ఆయన ఇంటి వద్ద మంగళవారం ఉదయం పోలీసులు చుట్టుముట్టారు. వారం రోజుల క్రితం సెక్షన్ 41-ఏ కింద పట్టాభికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు యత్నించారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు ఉండటంతో నోటీసులు ఇవ్వలేకపోయారు. పోలీసులు ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గారు.
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అసలు మేం వస్తున్న విషయాన్ని మీడియాకు చెప్పాల్సిన అవసరం ఏముందని పోలీసులు ప్రశ్నించారు. అందులో తప్పేముందంటూ ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత పోలీసులు టీడీపీ నోటీసులు జారీచేశారు.
కాగా.. నిన్న రాత్రి నుంచి పట్టాభి నివాసం వద్ద అదనపు బలగాలను మోహరించారు. ఈ క్రమంలో పట్టాభి రామ్ కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. మరోవైపు నగరంలో దళిత గర్జన నేపథ్యంలో పలువురు తెదేపా నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేస్తుండటం గమనార్హం.
విషయం తెలియడంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడకి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు విజయవాడలో దళిత గర్జన నేపథ్యంలో పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధంలోకి తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో టీడీపీ బొండా ఉమను ముందుగా హౌస్ అరెస్ట్ చేశారు. దళిత గర్జనకు వెళ్లనీయకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో దళితులకు స్వర్ణయుగం లాంటిదని అన్నారు. ముందస్తు గృహ నిర్బంధాలు వద్దంటూ చెప్పినప్పటికీ ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు అతిగా ప్రవర్తిస్తున్నారని, దళిత గర్జన జరిగితే ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న మోసాలు బయటపడతాయనే భయంతో ఇలా అరెస్టు చేశారని విమర్శించారు. ఆ సమయంలో కూడా ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి.