ఆర్కే బీచ్ లో వివాహిత గల్లంతు.. పెళ్లిరోజే విషాదం..కొనసాగుతున్న గాలింపు...

By SumaBala Bukka  |  First Published Jul 26, 2022, 1:40 PM IST

పెళ్లిరోజునాడే ఓ వివాహిత గల్లంతైన ఘటన విశాఖపట్నం ఆర్కే బీచ్ లో చోటు చేసుకుంది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో వివాహిత కోసం గాలింపు కొనసాగుతోంది. 


విశాఖ పట్నం : పెళ్లిరోజు సరదాగా గడపడానికి భర్తతో ఆర్కేబీచ్ కు వచ్చిన ఓ వివాహిత గల్లంతయ్యింది. సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇప్పటికీ ఇంకా ఆమె ఆచూకీ తెలియలేదు. ఆర్కే బీచ్ లో హెలికాప్టర్ తో  గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వివరాల్లోకి వెడితే... ఎన్‌ఏడీ ప్రాంతానికి చెందిన ఎన్‌.సాయిప్రియ భర్త శ్రీనివాస్‌తో కలిసి సోమవారం రాత్రి ఆర్కేబీచ్‌కు విహారానికి వచ్చింది. తీరంలో కొంతసేపు గడిపిన అనంతరం 7.30 గంటల సమయంలో తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు.

Latest Videos

undefined

ఈ క్రమంలో కాళ్లు కడుక్కోవడానికి సాయిప్రియ తీరానికి వెళ్లినట్లు భర్త శ్రీనివాస్‌ పోలీసులకు తెలిపారు. ఆ సమయంలో తాను సరిగ్గా వెనుకవైపు గమనించలేదని, ఫోన్లో ఏదో నోటిఫికేషన్ వస్తే చెక్ చేసి తిరిగి చూసేసరికి భార్య కనిపించలేదని.. భర్త వెల్లడించినట్లు పోలీసులకు తెలిపారు. అంతా ఒక్క నిమిషంలోపే జరిగిపోయిందని శ్రీనివాస్ తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించానని వారు కూడా వచ్చి చూశారని ఆయన తెలిపారు. 

కోనసీమ జిల్లాలో వరద బాధితులను పరామర్శిస్తున్న సీఎం జగన్.. వర్షంలోనూ సాగుతున్న పర్యటన

అయితే, ఎంతసేపటికీ ఆమె ఆచూకీ తెలియకపోవడం, చీకటి పడిపోవడంతో.. ఈ ఉదయం మళ్లీ గాలింపు మొదలుపెట్టారు. ఒక్క నిమిషంలో జరిగిపోయిందని.. ఆమె వేరే ఎక్కడికీ వెళ్లే అవకాశం కనిపించడం లేదని భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో ఆమె బీచ్‌లో గల్లంతై వుంటుందని భావిస్తున్నారు.హెలికాప్టర్ తో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ప్రస్తుతం సాయి ప్రియ సముద్రంలో కట్టుకుపోయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కొద్ది రోజులుగా పుట్టింట్లోనే సాయి ప్రియ ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె అదృశ్యం మీద అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా ఆమెను సముద్రంలోకి తోసేశారా? బీచ్ లో అంతమంది ఉంటే.. ఎవరూ గమనించలేదా? సాయిప్రియది నిజంగా తల్లంతేనా? ఒక్క నిమిషంలో కనిపించకుండా ఎలా పోయింది? కాళ్లు కడుక్కోవడానికే సముద్రం దగ్గరికి వెళ్లిందా? ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రెండు హెలికాప్టర్ ల ద్వారా, కోస్ట్ గార్డ్ నేవీల సహాయంలో వెతుకుతున్నారు. ఈ విషయం తెలియడంతో ఇరు కుటుంబాలు ఆర్కే బీచ్ కు చేరుకున్నారు. 

click me!