ప్రస్తుత ఏపీ సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుకున్నది రక్తసంబంధీకులేనని ఆయన డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలంతో నిర్దారణ అయినట్లు టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు.
కడప: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఈకేసును దర్యాప్తు చేస్తున్న సిబిఐ వివేకా కారు డ్రైవర్ షేక్ దస్తగిరిని విచారించగా అతడు సంచలన విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది. వివేకా హత్యపై దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇందులో బడా నేతల పేర్లు వుండటంతో రాజకీయంగా దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో వివేకా హత్యకేసుపై మరోసారి అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిల మధ్య మాటల యుద్దం సాగుతోంది.
ys vivekananda reddy murder పై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని... ఈ కేసు ఎంపీ అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వైసిపి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ స్పందించారు. వివేకా రక్తపు మరకల వెనక ఉన్నది రక్తసంబంధీకులేనని నిర్దారణ అయినతర్వాత కూడా ysrcp mla srikanth reddy అబద్దాలతో ప్రజలను నమ్మించాలని చూడటం దారుణమన్నారు. ఆయన అబద్దపు మాటలతో వివేకా ఆత్మ ఘోషిస్తుందన్నారు panchumarthi anuradha..
గతంలో వివేకా హత్యపై ఇష్టంవచ్చినట్లు మాట్లాడి ఎంపీ విజయసాయి రెడ్డితో పాటు పలువురు వైసిపి నేతలు ఇబ్బంది పడ్డారని అనురాధ గుర్తుచేసారు. దీన్ని దృష్టిలో వుంచుకుని శ్రీకాంత్ రెడ్డి మాట్లాడితే బావుండేదన్నారు. అసలు వివేకా హత్యపై మొదటినుండి తప్పుడు ప్రచారాలు చేస్తున్నది బులుగు మీడియా, YSRCP నేతలేనని అన్నారు. ఇప్పుడు నిజాలు బయటపడ్డాక కూడా అబద్దాలనే నమ్మించాలనే వైసిపి నేతల ప్రయత్నాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని పంచుమర్తి అనురాధ అన్నారు.
ఇదిలావుంటే వైఎస్ వివేకా హత్యకేసులో సిబిఐ విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే వివేకా దగ్గర పరిచేసిన డ్రైవర్ దస్తగిరి విచారించగా అతడు కీలక విషయాలను బయటపెట్టాడు. అతడు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్‌మెంట్ లో పెద్దతలకాయల పేర్లు బయటపెట్టాడు. వివేకా హత్యతో వైసిపి avinash reddy, భాస్కర్ రెడ్డితో పాటు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డి సంబంధాలున్నట్లు పేర్కొన్నాడు. సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో దస్తగిరి స్టేట్‌మెంట్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది.
బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి పగ పెంచుకున్నారని.. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను erra gangireddy మోసం చేశారని, మీ సంగతి తేలుస్తానంటూ గంగిరెడ్డి, అవినాష్‌లకు వివేకా వార్నింగ్ ఇచ్చినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అవినాష్ ఇంటి దగ్గర వాగ్వాదం జరిగిందని స్టేట్‌మెంట్‌లో తెలిపారు. తనను కావాలనే ఓడించారని, మీ కథ తేలుస్తానంటూ అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, డి.శంకర్‌రెడ్డిలకు వివేకా వార్నింగ్ ఇచ్చినట్లు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.
read more YS Viveka case: అవినాశ్ రెడ్డిని ఇరికించే కుట్ర... ఆధారాలు బయటపెట్టాలి: శ్రీకాంత్ రెడ్డి డిమాండ్
mlc elections లో మోసం చేయడంతో ఎర్ర గంగిరెడ్డి, గుజ్జుల జగదీశ్వర్‌రెడ్డిని ఆఫీసుకు పిలిపించి తిట్టినట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో దస్తగిరి వెల్లడించారు. తర్వాత కొన్ని రోజుల పాటు వైఎస్ వివేకా, గంగిరెడ్డి మధ్య మాటల్లేవని తెలిపాడు. ఈ క్రమంలోనే కోటి రూపాయిలు ఇస్తాం వివేకాను హత్యచేయాలని గంగిరెడ్డి ఆఫర్ చేసినట్టు దస్తగిరి వెల్లడించారు. మొత్తం హత్యకు 40 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చారని.. తనకు 5 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసి కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్టు దస్తగిరి చెప్పారు. అయితే తనకు ఇచ్చిన అడ్వాన్స్‌లో రూ.25 లక్షలను సునీల్ యాదవ్ తిరిగి తీసుకున్నాడని చెప్పారు.
ఇదే సమయంలో తన స్నేహితుడు మున్నా దగ్గర మిగిలిన రూ. 75 లక్షలు దాచానని దస్తగిరి తెలిపారు. సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి కలిసి వివేకా ఇంటి దగ్గర కుక్కను కారుతో తొక్కించి చంపేసినట్టు దస్తగిరి వెల్లడించారు. సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలతో కలిసి తాను వివేకా ఇంటి కాంపౌండ్ దూకి లోపలికి వెళ్లినట్టు దస్తగిరి చెప్పారు. అప్పటికే ఇంట్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డి తలుపు తీయడంతో లోపలికి వెళ్లినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు.