AP Local body Elections : కర్నూలులో వైసీపీకి షాక్.. అధికారంలో ఉన్న స్థానాల్లో ఓటమి...

By AN TeluguFirst Published Nov 15, 2021, 8:35 AM IST
Highlights

కర్నూల్ జిల్లా నంద్యాల మండలం భీమవరంలో 4వ వార్డులో  YCPకి  షాక్ తగిలింది.  వైసీపీ అభ్యర్థి నాగ పుల్లారెడ్డి పై  టిడిపి అభ్యర్థి జనార్ధన్ విజయం సాధించారు. 

కర్నూలు :  కర్నూలు జిల్లాలో వైసీపీకి ఊహించని షాక్ లే తగిలాయి.  ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్లు సర్పంచ్, వార్డు లకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. కొన్ని చోట్ల ప్రతిపక్ష టీడీపీ గెలుపొందగా.. ఎక్కువ చోట్ల అధికార వైసీపీ విజయం సాధించింది. అయితే అధికార పార్టీ అయ్యి ఉండి ఒకటి, రెండు చోట్ల వైసీపీ అభ్యర్థి పోటీ చేసిన వార్డులోనే ఓడిపోవడం గమనార్హం.  ఇలా పరాజయం పాలవడంతో జిల్లావ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..  kurnool district నంద్యాల మండలం భీమవరంలో 4వ వార్డులో  YCPకి  షాక్ తగిలింది.  వైసీపీ అభ్యర్థి నాగ పుల్లారెడ్డి పై  టిడిపి అభ్యర్థి జనార్ధన్ విజయం సాధించారు.  12 ఓట్ల తేడాతో జనార్ధన్ గెలుపొందడంతో టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.  ఇవన్నీ ఒక ఎత్తయితే..  నంద్యాల వైసీపీ జెడ్పిటిసి అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి సొంత వార్డులోనే ఇలా ఓటమి పాలవడం గమనార్హం.

AP Local body Elections: ఏపీలో కొనసాగుతున్న గ్రామ పంచాయితీ ఎన్నికలు

అలాగే  ఎమ్మిగనూరు మండలం కే తిమ్మాపురంలోనూ వైసీపీ కి షాక్ తగిలింది.  Panchayat electionsల్లో వైసిపి  వార్డ్ అభ్యర్థిపై 38 ఓట్ల తేడాతో CPI అభ్యర్థి విజయం సాధించారు. మరోవైపు క్రిష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టిడిపి రెబల్ అభ్యర్థి వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  వైసీపీపై  ప్రతిపక్ష TDPనే కాదు సీపీఐ కూడా గెలుపొందడంతో  జిల్లా వ్యాప్తంగా ఈ గెలుపోటములపై జరుగుతోంది.  ఈ రెండు స్థానాల్లో అధికారంలో ఉండి వైసీపీ కోల్పోవడం ఏమిటి..?  అని ఆ పార్టీకి చెందిన స్థానిక నేతలు చర్చించుకుంటున్నారంట.

ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికలకు ఆదివారం పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగింది. మధ్యాహ్నం రెండు గంటల  తర్వాత కౌంటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మొత్తం 69 పంచాయతీలకు గానూ 30 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన పంచాయితీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 

గొడ్డలిపోటును గుండెపోటన్నారు ... ‘‘ హూ కిల్డ్ బాబాయ్ ’’ అనే ప్రశ్నకు ఆన్సర్ దొరికేసిందిగా: అయ్యన్న వ్యాఖ్యలు

వివిధ జిల్లాలోని 36 సర్పంచ్‌ స్థానాలకు, వివిధ గ్రామాల్లోని 68 వార్డుల్లోనూ ఎన్నికలు జరిగాయి. మొత్తం 350 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరిగింది. అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. నాలుగు పంచాయతీలకు పోలింగ్ జరిగింది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఐదు సర్పంచ్ స్థానాలకు 9 వార్డు స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీస్థాయిలో ఓటర్లు తరలివచ్చారు. పెదకాకానిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 

click me!