లోకేష్ ఇలాకాలో... జూమ్ లోనే కరోనా పేషెంట్స్ కు అమెరికా వైద్యం (వీడియో)

By Arun Kumar PFirst Published Jul 14, 2021, 1:39 PM IST
Highlights

మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాల మండలం గొడవర్రు గ్రామంలో పర్యటిస్తున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇటీవలే కరోనా నుండి కోలుకున్నవారిని పరామర్శించారు. 

మంగళగిరి: తన నియోజకవర్గ పరిధిలోని ఓ గ్రామంలో కరోనా బారినపడ్డ పేషెంట్స్ కి సాంకేతికతను ఉపయోగించి వైద్యం అందేలా చేశారు టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్. ఇలా టిడిపి, ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో 60 మందికి కోవిడ్ చికిత్స‌ అందింది.  తాజాగా ఆ గ్రామంలో కరోనా పర్యటించిన లోకేష్ కరోనా నుండి కోలుకున్న వారిని పరామర్శించారు.  

మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని దుగ్గిరాల మండలం గొడవర్రు గ్రామంలో లోకేష్ పర్యటిస్తున్నారు. ఇటీవల కరోనాబారిన పడినా హాస్పిట‌ల్ వెళ్ల‌కుండానే ఇంట్లోనే ఉంటూ జూమ్‌లోనే అమెరికా వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ట్రీట్‌మెంట్‌ పొందిన గ్రామస్తులను లోకేష్ కలుసుకున్నారు. మొదట కరోనాతో పోరాడి కోలుకున్న ఆ గ్రామ సర్పంచ్ విశ్వనాధపల్లి శివకుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ  తర్వాత గ్రామంలో కరోనాతో పోరాడి జయించిన గ్రామస్తులను కూడా పరామర్శించారు. 

ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ కక్షసాధింపుకు పాల్పడిన టిడిపి కార్యకర్త గోరంట్ల అనిల్ కుటుంబాన్ని పరామర్శించారు నారా లోకేష్. ఆ కుటుంబానికి అండగా ఉంటానని లోకేష్ హామీ ఇచ్చారు. 

వీడియో

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... థర్డ్ వేవ్ పొంచి ఉందని... గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని... ఎటువంటి లక్షణాలు ఉన్నా వెంటనే అప్రమత్తం అవ్వాలన్నారు.  కరోనా తగ్గిపోయిందని నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. గ్రామస్తులకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 

''కరోనా విజృంభించిన సమయంలో ప్రతి ఇంటికి తిరిగి వైద్య సహాయం అందించిన సర్పంచ్ శివకుమార్ ని అభినందిస్తున్నాను. ఆయన గ్రామంలోని అనేక సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారం కోసం నేను కృషి చేస్తా'' అని హామీ ఇచ్చారు. 

''ఎన్నికల ముందు ఇళ్లు కట్టి ఇస్తాం అన్న జగన్ రెడ్డి ఇప్పుడు ప్రజలపై పెను భారం మోపుతున్నారు. పేదవాళ్ళు ఎప్పటికీ పేదవాళ్ల గానే ఉండిపోవాలనేది జగన్ రెడ్డి ఆలోచన. ఇళ్ల నిర్మాణం ప్రారంభించకపోతే ఇళ్ల స్థలాలు వెనక్కి లాక్కుంటాం అని బెదిరిస్తున్నారు. ఎవడబ్బ సొమ్మని లాక్కుంటారు. మీకు అండగా నేను పోరాటం చేస్తాను'' అని భరోసా ఇచ్చారు. 

read more  రైతులేమైనా దేశద్రోహులా... సంకెళ్లతో బందించి అవమానిస్తారా?: జగన్ పై అచ్చెన్న సీరియస్

''సిమెంట్, ఇసుక, ఐరన్ అన్ని ధరలు పెరిగిపోయాయి.పేదవాడు సొంతగా ఇళ్ళు కట్టే పరిస్థితి రాష్ట్రంలో లేదు. నిత్యావసర సరుకుల ధరలు కూడా విపరీతంగా పెంచేసారు. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి నిరుద్యోగులను మోసం చేసారు. జాబ్ క్యాలెండర్ పేరుతో జాదూ క్యాలెండర్ విడుదల చేసారు. చంద్రబాబు గారి హయాంలో గ్రామాల్లో ఏ రోజు కరెంట్ కోతలు లేవు. జగన్ రెడ్డి పాలనలో గ్రామాల్లో కరెంట్ కోతలు ఎక్కువ ఉన్నాయి. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేసారు'' అంటూ ప్రజాసమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. 

''మరుగుదొడ్లు, చెత్త పైనా కూడా పన్నులు వేసి ప్రజల్ని జగన్ రెడ్డి బాధేస్తున్నాడు. రకరకాల కారణాలు చెప్పి పెన్షన్లు ఎత్తేస్తున్నారు. 3వేల పెన్షన్ ఇస్తా అన్న జగన్ రెడ్డి పెన్షన్ పెంచకపోగా ఉన్న పెన్షన్లు ఎత్తేయడం దారుణం. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యల మీద పోరాడతాం. ప్రజల పక్షాన నిలబడతాం'' అని లోకేష్ స్పష్టం చేశారు. 

click me!