చంద్రబాబు టూర్‌లో జూ.ఎన్టీఆర్ జెండాలు: నెక్ట్స్ సీఎం అంటూ నినాదాలు

Published : Jul 14, 2021, 01:23 PM ISTUpdated : May 20, 2022, 05:09 PM IST
చంద్రబాబు టూర్‌లో జూ.ఎన్టీఆర్ జెండాలు: నెక్ట్స్ సీఎం అంటూ నినాదాలు

సారాంశం

టీడీపీలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ హాట్ టాపిక్ గా మారారు. ఇవాళ కృష్ణా జిల్లాలో చంద్రబాబు టూర్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ జెండాలను చేతబూని చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు  చేశారు. 

విజయవాడ: చంద్రబాబు టూర్‌లో జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో తెలుగు తమ్ముళ్లు హల్‌చల్ చేశారు. గతంలో కుప్పం టూర్ లో కూడ జూనియర్ ఎన్టీఆర్ ను ప్రచారానికి తీసుకురావాలని చంద్రబాబును ఆ పార్టీ కార్యకర్తలు కోరారు. ఆ తర్వాత కూడ జూనియర్ ఎన్టీఆర్   గురించి కొందరు పార్టీ నేతలు కూడ మాట్లాడిన విషయం తెలిసిందే.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో  ఏపీ రాష్ట్రంలో  టీడీపీ  అధికారాన్ని కోల్పోయింది.  ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో  పలువురు టీడీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు ఆ పార్టీని వీడి బీజేపీ, వైసీపీలలో చేరారు. చంద్రబాబు నాయుడు ఏదైనా టూర్ కు వెళ్లిన సమయంలో పార్టీ కార్యకర్తల నుండి జూనియర్ ఎన్టీఆర్ గురించి  క్యాడర్  ప్రశ్నిస్తోంది. ఇవాళ కృష్ణా జిల్లాలోని మచిలీపట్టణంలో  చంద్రబాబునాయుడు టూర్ సమయంలో కూడ ఆ పార్టీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ జెండాలను చేతబూని బాబు కాన్వాయ్ వెంట వెళ్లారు. ఈ ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం అంటూ నినాదాలు రాసి ఉన్నాయి. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో  జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని హైద్రాబాద్ వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ సమయంలో ఆసుపత్రిలో ఉండి కూడ టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాలేదు. 

PREV
click me!

Recommended Stories

క్షమాపణలు చెప్పిన టీడీపీ ఆర్టిస్ట్ సునీల్! | YS Bharati Video Controversy | TDP Sunil Apology
ఆ నీచానికి ఒడిగట్టింది మీరే | Perni Nani Fires On Chandrababu | Asianet Telugu