తిక్కొడు తిరునాళ్లకు పోయినట్లుంది వైఎస్ జగన్ తీరు..: లోకేష్ ఎద్దేవా

By Arun Kumar PFirst Published Feb 29, 2024, 2:15 PM IST
Highlights

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి నారా లోకేష్ సెటైర్లు వేసారు. తిక్కోడు తిరునాళ్లకు వెళితే ఎక్కా దిగా సరిపోయిందట... జగన్ తీరు అలాగే వుందని లోకేష్ ఎద్దేవా చేసారు. 

అమరావతి : ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఆంధ్ర ప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన కూటమి నాయకుల మధ్య మాటలయుద్దం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా ఇరుపార్టీల ముఖ్య నాయకుల మధ్య సోషల్ మీడియా వార్ సాగుతోంది. తాజాగా వైసిపి అధినేత,  సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేసారు. 

వైసిపి దశలవారిగా అసెంబ్లీ, లోక్ సభ ఇంచార్జీలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. చాలారోజులుగా వైసిపి అభ్యర్థుల ఎంపిక, ప్రకటన ప్రక్రియ కొనసాగుతుండగా తాజాగా ఎనిమిదో జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. కానీ టిడిపి మాత్రం కేవలం ఒకే విడతలో వందమందికి పైగా కూటమి అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వైసిపి అభ్యర్థుల ప్రకటన వ్యవహారంపై నారా లోకేష్ సెటైర్లు వేసారు. 

''తిక్కొడు తిరునాళ్లకు పోతే.. ఎక్కా దిగా సరిపోయిందట.. అలా ఉంది వైసీపీ వరుస సమన్వయకర్తల జాబితాలు'' అంటూ  లోకేష్ ఎద్దేవా చేసారు. ఎక్స్ వేదికన పోస్ట్ చేసిన ఈ ట్వీట్ కు కన్ఫ్యూజన్ జగన్, వైసిపి అంతం అంటూ హ్యాష్ ట్యాగ్స్ పెట్టారు. ఈ ట్వీట్ కు వైసిపి ఎనిమిదో జాబితా ఇంచార్జీల ప్రకటనను లోకేష్ జతచేసారు. 

Also Read  ప్లీజ్ మోదీజీ ... ఆ రాజధానిగా విశాఖ ... మార్చండి : వైజాగ్ లో ఆసక్తికర ప్లెక్సీలు (వీడియో)

ఇదిలావుంటే తెలుగు క్రికెటర్ హనుమ విహారి వ్యవహారంపైనా నారా లోకేష్ స్పందించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంతర్జాతీయ క్రికెటర్ హనుమ విహారీని రాష్ట్ర రంజీ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పించడాన్ని తప్పుబట్టారు. ఓ రాజకీయ నేత కొడుకు కోసమే తనను టార్గెట్ చేసారన్న విహారి ఆరోపణలపై లోకేష్ సీరియస్ అయ్యారు. 

''అంతర్జాతీయస్థాయి క్రికెటర్ కన్నా... వైసిపి వీధినేత పంతమే మిన్న...! జగన్మోహన్ రెడ్డి జమానాలో ఆడుదాం ఆంధ్రా అంటే ఏమో అనుకున్నా...క్రీడాకారుల జీవితాలతో చెలగాటమాడటం అని కొత్తగా తెలిసింది'' అని లోకేష్ ఎద్దేవా చేసారు. 

''జట్టులో 17వ ఆటగాడిగా ఉన్న తిరుపతి వైసిపి కార్పొరేటర్ పుత్రరత్నాన్ని పద్ధతి మార్చుకోవాలని మందలించడమే ఆంధ్రా రంజీ జట్టు కెప్టెన్  హనుమ విహారి చేసిన మహాపరాధం. భారత్ తరపున 16టెస్ట్ మ్యాచ్ లు ఆడి, ఆంధ్రా రంజీ జట్టుకు ఏడేళ్లు ఏకధాటి కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం వైసిపి వీధి నాయకుడి పంతం ముందు దిగదుడుపే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుడు శరత్ చంద్రారెడ్డిని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నియమించినపుడే ఎసిఎ పరువు బంగాళాఖాతంలో కలిసిపోయింది. తాలిబాన్లను తలదన్నే వైసిపి విధ్వంసకపాలనలో ఇప్పటివరకు పరిశ్రమలు పక్కరాష్ట్రాలకు వెళ్లిపోవడం చూశాం... ఇప్పుడు అంబటిరాయుడు, హనుమ విహారి వంటి కొమ్ములు తిరిగిన క్రీడాకారులు కూడా పారిపోతున్నారు... వైకాపా నాయకులకు తిక్కరేగిందంటే అంతర్జాతీయస్థాయి క్రికెటర్ అయినా ఇంటికి పోవాల్సిందే...గట్లుంటది మనోళ్లతోటి!!'' అంటూ లోకేష్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. 

click me!