ఏపీలో పాదయాత్రకు లోకేష్ ప్లాన్: గాంధీ జయంతి రోజున ప్రారంభించే చాన్స్

By narsimha lode  |  First Published May 30, 2022, 10:39 PM IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే  లోకేష్ పాదయాత్రను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ మేరకు లోకేష్ పాదయాత్ర కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


అమరావతి: Andhra Pradesh రాష్ట్రంలో పాదయాత్ర ప్రారంభించాలని TDP  జాతీయ ప్రధాన కార్యదర్శి Nara Lokesh భావిస్తున్నారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో Chandrababu Naidu  గాంధీ జయంతి రోజున అనంతపురం జిల్లా హిందూపురంలో పాదయాత్రను ప్రారంభించారు. అదే రోజున పాదయాత్రను ప్రారంభించాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ Cycle Yatra  చేయాలని అప్పట్లో ప్లాన్ చేశారు. అయితే అదే సమయంలో చంద్రబాబు నాయుడు పాదయాత్రను ప్రారంభించారు. దీంతో లోకేష్ సైకిల్ యాత్రను వాయిదా వేసుకున్నారు.  చంద్రబాబు పాదయాత్ర పూర్తైన తర్వాత సైకిల్ యాత్ర చేయాలని భావించాడు. అయితే  ఆ సమయంలో పార్టీ కార్యక్రమాల నేపథ్యంలో సైకిల్ యాత్ర ప్రారంభించలేదు. చంద్రబాబు పాదయాత్ర కంటే ముందుగానే సైకిల్ యాత్ర చేయాలని కూడా ప్లాన్ చేసుకున్నా పలు కారణాలతో సైకిల్ యాత్ర వాయిదా పడింది. అయితే ఈ లోపుగా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేయడంతో లోకేష్  సైకిల్ యాత్ర చేయలేదు. 

Latest Videos

undefined

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2012 అక్టోబర్ 2వ తేదీన Hindupuram లో పాదయాత్రను ప్రారంభించారు.  పాదయాత్రను విశాఖపట్టణంలో ముగించారు. ఈ పాదయాత్రలో ప్రజల నుండి వచ్చిన వినతుల ఆధారంగా  ఎన్నికల మేనిఫెస్టోలో పంట రుణ మాఫీ వంటి అంశాలను చంద్రబాబు చేర్చారు. ఈ పాదయాత్ర 2014లో అవశేష ఆంధ్రప్రదేశ్ లో TDP అధికారంలోకి వచ్చేందుకు కారణమైందనే అభిప్రాయం లేకపోలేదు. 

చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో విపక్ష నేతగా ఉన్న YS Jagan పాదయాత్ర చేశారు.ఈ పాదయాత్ర 2019లో ఏపీలో YCP ని అధికారంలోకి తీసుకు వచ్చిందనే అభిప్రాయాలున్నాయి.

లోకేష్ కూడా పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో లోకేష్ పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభిస్తే మధ్యలో యాత్రకు బ్రేక్ ఇవ్వకుండా కొనసాగించాలలని లోకేష్ భావిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభించడానికి ముందే ఇతరత్రా కార్యక్రమాలను పూర్తి చేయాలని లోకేష్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే  మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మంగళగిరిలోని  రెండు నెలల్లో లోకేష్ పాదయాత్ర పూర్తయ్యే అవకాశం ఉంది. మంగళగిరి టూర్ పూర్తి కాగానే పాదయాత్రను ప్రారంభించే అవకాశం ఉంది. ఏడాది పాటు పాదయాత్ర ఉండేలా లోకేష్ ప్లాన్ చేస్తున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లోనే టీడీపీ ఉంచాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు.

also read:చంద్రబాబు దత్తపుత్రుడికి ఇచ్చిన విలువ సొంత పుత్రుడికి ఇవ్వడం లేదు: విజయసాయి రెడ్డి

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. వైసీపీ మాత్రం ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని చెబుతుంది.,  టీడీపీ మాత్రం ఏపీలో ముందస్తు ఎన్నికలుంటాయని పదే పదే చెబుతుంది.  ఈ నేపథ్యంలోనే పాదయాత్రను వీలైనంత త్వరగా ప్రారంభించాలని లోకేష్ భావిస్తున్నారు. 

పాదయాత్ర కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చంద్రబాబునాయుడు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించే సమయంలో పార్టీ కార్యక్రమాలను లోకేష్ పర్యవేక్షించేవారు. ఈ సమయంలోనే లోకేష్ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా చూసుకొనేవారు. యాత్ర సాగుతున్న తీరు తెన్నులపై  పార్టీ నేతలతో చర్చించేవారు. అదే సమయంలో ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై కూడా నతలతో లోకేష్ మాట్లాడి పరిస్థితులను తెలుసుకొనేవారు. ప్రతిరోజూ పార్టీ సీనియర్లతో లోకేష్ సమావేశాలు నిర్వహించేవారు. అప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో లోకేష్ ఎక్కువగా ఇన్ వాల్వ్ అవుతున్నారు. అదే సమయంలో హెరిటేజ్ సంస్థకు కూడా లోకేష్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

click me!