కుప్పంలో గ్రానైట్ అక్రమ మైనింగ్.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: సీఎస్‌కు చంద్రబాబు లేఖ

Published : May 30, 2022, 08:03 PM IST
కుప్పంలో గ్రానైట్ అక్రమ మైనింగ్.. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: సీఎస్‌కు చంద్రబాబు లేఖ

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కుప్పంలో జరుగుతున్న గ్రానైట్ అక్రమ మైనింగ్ గురించి ఓ లేఖ రాశారు. ఈ అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీ విచారణ చేపడుతున్నా.. అక్రమ మైనింగ్ కార్యకలాపాలు మాత్రం ఆగడం లేదని ఆరోపించారు. ఇటీవలే పది అక్రమ గ్రానైట్ లారీలను అధికారులు సీజ్ చేశారని తెలిపారు. అందుకు సంబంధించిన ఫొటోలనూ సీఎస్‌కు పంపారు.  

అమరావతి: చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంపై ఫోకస్ పెట్టారు. ఇక్కడ జరుగుతున్న గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. గుడిపల్లె మండలం గుతర్లపల్లిలో అక్రమ మైనింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్నదని, ఈ అక్రమ మైనింగ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో విచారణ జరుగుతున్నదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారిస్తున్నప్పటికీ అక్రమాలు మాత్రం ఆగడం లేదని ఆరోపించారు.

అధికార పార్టీ నేతలతో స్థానిక రెవెన్యూ అధికారులు కుమ్మక్కయారని ఆయన ఆరోపించారు. వారు అక్రమ మైనింగ్‌కు సహకరిస్తున్నారని తెలిపారు. భారీ స్థాయిలో అంటే.. పర్యావరణం దెబ్బతీసేలా అక్రమ మైనింగ్ కార్యకలాపాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారని వివరించారు.

ఎన్జీటీ విచారణ జరుగుతున్నా యధేచ్చగా గ్రానైట్ అక్రమ మైనింగ్ జరుగుతున్నదని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అక్రమంగా మైనింగ్ చేసి గ్రానైట్‌ను తరలిస్తున్న పది లారీలను అధికారులు సీజ్ చేయడం.. అక్కడి పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తున్నదని తెలిపారు. తనిఖీలు పెంచి అక్రమ మైనింగ్‌ను అరికట్టాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అక్రమంగా తవ్విన గ్రానైట్‌ను తరలిస్తూ పట్టుబడ్డ లారీల ఫొటోలనూ ఆ లేఖకు జత చేసి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పంపారు.

కుప్పంలో chandrababu naidu సొంత ఇల్లు నిర్మించుకుంటే చూడాలన్న నియోజకవర్గ ప్రజల కల త్వరలోనే తీరనుంది. దీనికి అవసరమైన Place registration కోసం సంబంధిత పత్రాలపై ఆయన సంతకం కూడా అయిపోయింది. పార్టీ వర్గాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం... కుప్పం-పలమనేరు జాతీయ రహదారి సమీపంలో శాంతిపురం మండల పరిధిలోని కడపల్లె, కనమలదొడ్డి గ్రామాల మధ్య శివపురం ఎదురుగా 2.10 ఎకరాల స్థలాన్ని చంద్రబాబు Own House నిర్మాణం కోసం కొనాలని నిర్ణయించారు.

కుప్పం పర్యటనకు వెళ్లిన ఆయన ఆ స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలపై ఇటీవలే సంతకాలు చేసి వేలిముద్రలు వేశారు. ఈ నెల 29న స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జూన్ 5న చంద్రబాబు, తన సతీమణి భువనేశ్వరితో కుప్పం వచ్చి ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఇక్కడ గృహంతో పాటు పార్టీ సమావేశాల కోసం ప్రత్యేకంగా కార్యాలయం భవనం కూడా నిర్మించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం