చేనేత వస్త్రాలపై జీఎస్టీ పెంపు .. కార్మికుల దుస్థితిని గుర్తించండి : నిర్మలా సీతారామన్‌కు నారా లోకేష్ లేఖ

Siva Kodati |  
Published : Mar 05, 2022, 04:58 PM IST
చేనేత వస్త్రాలపై జీఎస్టీ పెంపు .. కార్మికుల దుస్థితిని గుర్తించండి : నిర్మలా సీతారామన్‌కు నారా లోకేష్ లేఖ

సారాంశం

జీఎస్టీ 5 నుంచి 12శాతం పెంచడం వల్ల చేనేత రంగంపై పెనుప్రభావం పడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దీనిని మినహాయించాలని కేంద్ర ఆర్ధిక  శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన లేఖ రాశారు. 

హస్తకళలు, చేనేత వృత్తులపై జీఎస్టీ భారం తగ్గించాలని టీడీపీ (tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (lokesh) కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. (gst) జీఎస్టీ 5 నుంచి 12శాతం పెంచడం వల్ల చేనేత రంగంపై పెనుప్రభావం పడుతోందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా పన్ను విధానం వస్త్ర రంగాన్ని నాశనం చేసే ప్రమాదం ఉందని.. అందువల్ల పన్ను పూర్తిగా మినహాయించాలి లేదా 5శాతం వద్ద కొనసాగించాలని ఆయన సీతారామన్‌ను కోరారు. కొవిడ్‌తో నష్టపోయిన చేనేత కార్మికుల దుస్థితిని కేంద్రం గుర్తించాలని..  నేతన్నలకు వైసీపీ ప్రభుత్వం (ysrcp govt) ప్రోత్సాహకాలు అందకపోవడం వల్లే ఈ గడ్డు పరిస్థితి వచ్చింది నారా లోకేష్ లేఖలో ప్రస్తావించారు.

మరోవైపు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అనంతపురం జిల్లా ( Anantapur district) పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటుచేసుకుంది. ఆహ్వానం అందలేదని నాసిన్ అకాడమీ భూమి పూజ కార్యక్రమానికి వైసీపీ ఎంపీ రంగయ్య హాజరుకాలేదు. అధికారులు సమన్వయ లోపం కారణంగానే వాట్సాప్‌లో ఆహ్వానం అందించారని చెప్పారు. నిర్మలా సీతారామన్ పర్యటనలో బీజేపీ నేతలకు ప్రాధాన్యం కల్పించడంపై ఆయన మండిపడ్డారు. అధికారుల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 

అధికారులు రెండు మూడు రోజుల ముందే చెప్పాల్సిందని.. కానీ అలా జరగలేదని అన్నారు. ఫోన్ కూడా చేయలేదని తెలిపారు. వాట్సాప్‌లో ఆహ్వానం పెట్టారని చెప్పారు. అసలు కార్యక్రమం ఎలా చేస్తున్నారనే సమాచారం కూడా ఇవ్వలేదని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు పార్లమెంట్ సభ్యునికి ఆహ్వానం అందించాల్సి ఉంటుందన్నారు. కేంద్ర అధికారుల తీరుపై మరో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించలేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. నాసిన్ ఇన్విటేషన్‌లో తన పేరు లేదని మాదవ్ తెలిపారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇక, జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం పాలసముద్రం నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ సంస్థ(NACIN)కు నిర్మలా సీతారామన్ శనివారం భూమి పూజ చేశారు.  500 ఎకరాల్లో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రి శంకరనారాయణ, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్‌ పాల్గొన్నారు. తొలుత బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న నిర్మల సీతారామన్.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పాలసముద్రం చేరుకున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ambati Rambabu Pressmeet: చంద్రబాబు, పవన్ పై అంబటి సెటైర్లు | Asianet News Telugu
Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu