అందుకే ఢిల్లీ వచ్చా , జగన్ అవినీతి అందరికీ తెలుసు.. వైసీపీ వ్యతిరేక పార్టీలు మాతో కలిసి రావాలి : లోకేష్

Siva Kodati |  
Published : Sep 16, 2023, 08:06 PM IST
అందుకే ఢిల్లీ వచ్చా , జగన్ అవినీతి అందరికీ తెలుసు.. వైసీపీ వ్యతిరేక పార్టీలు మాతో కలిసి రావాలి : లోకేష్

సారాంశం

చంద్రబాబు అరెస్ట్ అనేది ఓ స్పీడ్ బ్రేకర్ వంటిదన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ . వచ్చే లోక్‌సభ , అసెంబ్లీ సీట్లను తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ వ్యతిరేక పార్టీలు టీడీపీ, జనసేనతో కలిసి రావాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, ఏపీలో పరిస్ధితులపై దేశ ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకే ఢిల్లీ వచ్చానని తెలిపారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఢిల్లీలో ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ , అసెంబ్లీ సీట్లను తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జగన్ చేసిన అవినీతి అందరికీ తెలుసునని లోకేష్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్ట్ అనేది ఓ స్పీడ్ బ్రేకర్ వంటిదని ఆయన అభివర్ణించారు. వైసీపీ వ్యతిరేక పార్టీలు టీడీపీ, జనసేనతో కలిసి రావాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు.

అంతకుముందు సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ ఎంపీలతో  నారా లోకేష్ ఢిల్లీలో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ లోక్‌సభ ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.

ALso Read: చంద్రబాబు అరెస్ట్‌ను పార్లమెంట్‌లో లేవనెత్తండి .. టీడీపీ ఎంపీలకు లోకేష్ దిశానిర్దేశం

ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై లోకేష్ వారికి దిశానిర్దేశం చేశారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబుు అరెస్ట్ చేశారన్న వాదనను పార్లమెంట్‌లో బలంగా వినిపించాలని ఆయన ఎంపీలకు సూచించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్ధితులను ఉభయసభల దృష్టికి తీసుకెళ్లాలని లోకేష్ కోరారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?