గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం .. ఆయనేమైనా ఫోరెన్సిక్ ఎక్స్‌పర్టా : అనంత ఎస్పీపై నారా లోకేశ్ విమర్శలు

By Siva KodatiFirst Published Aug 10, 2022, 5:26 PM IST
Highlights

అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోని ఫేక్ అని చెప్పడానికి ఫకీరప్ప ఏమైనా ఫోరెన్సిక్ ఎక్స్‌పర్టా అని ప్రశ్నించారు. 
 

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్‌కి (gorantla madhav video call) సంబంధించి అనంతపురం ఎంపీ ఫకీరప్ప (anantapur superintendent of police) ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌పై స్పందించారు టీడీపీ (tdp) నేత నారా లోకేశ్ (nara lokesh) . అనంతపురం ఎస్పీ ఏమైనా ఫోరెన్సిక్ ఎక్స్‌పర్టా అని ఆయన ప్రశ్నించారు. ఆ వీడియో ఫేక్ అని ఎస్పీ ఎలా తేల్చారని నారా లోకేష్ నిలదీశారు. ఒరిజినల్ ఉందని ఎస్పీ భావిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. 

అంతకుముందు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియాతో మాట్లాడుతూ.. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు అశ్లీల వీడియో మార్పింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చని , ఈ వీడియో ఒరిజినల్ వీడియో కాదని స్పష్టం చేశారు. ఈ వీడియోపై ఎంపీ అభిమాని వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 4వ తేదీన టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. 

Also REad:ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు.. కడిగిన ముత్యంలా వస్తాననే నమ్మకంతోనే ఉన్నా: గోరంట్ల మాధవ్

తొలుత ఈ వీడియో ITDP Official అనే వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశారన్నారు. ఈ నెల 4వ తేదీ రాత్రి +447443703968 నెంబర్ నుండి ఈ వీడియోను పోస్టు చేశారని ఎస్పీ వివరించారు. ఈ ఫోన్ నెంబర్ యూకేకు చెందిన వోడాఫోన్ నెంబర్ అని తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ చెప్పారు. ఈ నెంబర్ ఉపయోగిస్తుంది ఎవరనే విషయమై తాము దర్యాప్తు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. యూకే నుండి పోస్టు చేసిన వీడియో ఎడిట్ చేసినట్టుగా ఉందని ...ఈ ఫోన్ ఎవరు వాడుతున్నారనే విషయమై వివరాలు ఇవ్వాలని వొడాఫోన్ ను కూడా సమాచారం కోరినట్టుగా ఫకీరప్ప చెప్పారు. 

ఈ వీడియోను పోస్టు చేసిన వ్యక్తిని ట్రేస్ చేసే వరకు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు ఫేక్ వీడియోలేనని ఆయన చెప్పారు. ఈ విషయమై ఒరిజినల్ వీడియో దొరికితే తప్ప ఇది ఒరిజినలా నకిలీదా అనేది తేలుతుందన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలోని వీడియో ఎడిటింగ్ లేదా మార్పింగ్ చేశారనే సందేహలున్నాయని ఫకీరప్ప పేర్కొన్నారు. 

ఓ వ్యక్తి పంపిన వీడియోను షూట్ చేసి మరో వ్యక్తి ఈ వీడియోను పోస్టు చేశారని ఎస్పీ వివరించారు.ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతామన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంతవరకు తమకు ఫిర్యాదు చేయలేదని ఎస్పీ చెప్పారు.  ఈ వీడియోకు సంబంధించి బాధితులు ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదన్నారు. 

click me!