‘దొంగలంతా వైసీపీ చుట్టే.. షర్మిల ఉంగరాన్నే కొట్టేశారు’

Published : Apr 01, 2019, 01:53 PM IST
‘దొంగలంతా వైసీపీ చుట్టే..  షర్మిల ఉంగరాన్నే కొట్టేశారు’

సారాంశం

దొంగలంతా వైసీపీ చుట్టూనే ఉన్నారని టీడీపీ నేత లంకా దినకర్ అన్నారు.

దొంగలంతా వైసీపీ చుట్టూనే ఉన్నారని టీడీపీ నేత లంకా దినకర్ అన్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో షర్మిల చేతి ఉంగరాన్ని ఓ వ్యక్తి కొట్టేసేందుకు ప్రయత్నించారు. కాగా ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది.అయితే.. దీనిపై లంకా దినరకన్ తాజాగా స్పందించారు.

వైసీపీది అలీబాబా దొంగల పార్టీ అన్నారు. దొంగలంతా వైసీపీ చుట్టే ఉన్నారని.. జగన్ సోదరి షర్మిల ఉంగరాన్నే కొట్టేశారని విమర్శించారు. వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మహిళలకు ఇస్తున్న పసుపు-కుంకుమను అడ్డుకునేందుకు వైసీపీ యత్నిస్తోందని లంకా దినకర్‌ మండిపడ్డారు. 

వైసీపీ నేతలు రాక్షసానందాన్ని పొందుతున్నారని, నీచ రాజకీయాల కోసం ఫ్యాక్షన్‌ని పెంచిపోషిస్తున్నారని లంకా దినకర్‌ తీవ్ స్థాయిలో విమర్శించారు.

PREV
click me!

Recommended Stories

IMD Weather Update : కనుమ రోజు కనువిందు చేసే వెదర్.. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం
CM Chandrababu Speech: తిరుపతి వెడ్డింగ్ హబ్ గా తయారవుతుంది | Wedding Hub | Asianet News Telugu