లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూసిన ఉండవల్లి

Published : Mar 30, 2019, 11:38 AM IST
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూసిన ఉండవల్లి

సారాంశం

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  తెరకెక్కించిన తాజా చిత్రం లక్ష్మీఎస్ ఎన్టీఆర్.

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  తెరకెక్కించిన తాజా చిత్రం లక్ష్మీఎస్ ఎన్టీఆర్. ఈ సినిమా ఏపీ ఎన్నికల పై ప్రభావం చూపించే అవకాశం ఉందని దీనిని విడుదలను ఏపీలో అడ్డుకున్నారు. కాగా.. తెలంగాణ , ఇతర  ప్రాంతాల్లో సినిమా విడుదలై.. పాజిటివ్ టాక్ తో నడుస్తోంది.

కాగా.. ఇప్పుడు ఈ సినిమాని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వీక్షించారు. రాజమండ్రిలో సినిమా విడుదల కాకపోవడంతో.. హైదరాబాద్ వచ్చి మరీ సినిమాని  చూశారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాకు గీత రచయితగా పనిచేసిన సిరా శ్రీ, ఎమెస్కో అధినేత విజయ్‌ కుమార్‌లతో కలిసి అరుణ్‌ కుమార్‌ సినిమా చేశారు. 

ఈ విషయాన్ని సిరాశ్రీ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హైకోర్టు స్టే విధించటంతో ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా విడుదల కాలేదు.

 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : సంక్రాంతి సెలవులు మరో రెండ్రోజులు పొడిగిస్తారా..?
IMD Weather Update : కనుమ రోజు కనువిందు చేసే వెదర్.. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం