పీఎస్ఎల్‌వీ - సీ45 ప్రయోగం విజయవంతం

By ramya NFirst Published Apr 1, 2019, 10:09 AM IST
Highlights

 పీఎస్‌ఎల్‌వీ - సీ45 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. 


 పీఎస్‌ఎల్‌వీ - సీ45 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 9.27గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 

ఈ వాహక నౌక డీఆర్‌డీవోకు చెందిన ఎలక్ట్రానిక్‌ ఇంటిలిజెన్స్‌ శాటిలైట్‌ ఇమిశాట్‌తోపాటు విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను మూడు వేర్వేరు కక్ష్యల్లో ప్రవేశపెట్టనుంది. లిథువేనియా, స్పేయిన్‌, స్విట్జర్లాండ్‌, అమెరికాకు చెందిన 28 నానో ఉపగ్రహాలను ఇది నింగిలోకి మోసుకెళ్లింది.   4 స్ట్రాపాన్ బూస్టర్లతో శాస్త్రవేత్తలు తొలిసారి ఈ ప్రయోగం నిర్వహించారు. పీఎస్ఎల్‌వీ - క్యూఎల్‌గా ఈ శాటిలైట్‌కు నామకరణం చేశారు.

click me!