మా తప్పు ఏముంది..? ఈసీకి కడప ఎస్పీ లేఖ

Published : Mar 28, 2019, 10:08 AM IST
మా తప్పు ఏముంది..? ఈసీకి కడప ఎస్పీ లేఖ

సారాంశం

ఈసీకి కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ లేఖ రాశారు. తన బదిలీ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.


ఈసీకి కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ లేఖ రాశారు. తన బదిలీ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపనలు రుజువు చేయాలని లేదా పిర్యాదు చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీకి లేఖ రాశారు. 

‘ముప్పై ఏళ్లుగా నిజాయతీతో బతుకుతున్నా.. ఇప్పుడు ఒక్కసారిగా నా బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యుల ముందు పరువు పోయింది.. నాపై ఆరోపణలు నిరూపించాలి లేదా నాపై తప్పుడు ఆరోపణలు చేసినవారి (విజయసాయిరెడ్డి)పై చర్యలు తీసుకోవాలి’ అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఏ తప్పూ చేయని తనను అకారణంగా బదిలీ చేశారని అందులో ఆవేదన వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

Chandrababu, Lokesh కి వెంకన్న ప్రసాదం ఇచ్చిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ | Asianet News Telugu
నారావారిపల్లెలో CM Chandrababu Family గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు | Asianet News Telugu