అజ్ఞాతం వీడిన టీడీపి నేత రవికుమార్: పోలీసుల ముందు లొంగుబాటు

By telugu teamFirst Published May 27, 2020, 10:57 AM IST
Highlights

శ్రీకాకుళం జిల్లా పొందుగుల తాహిసిల్దార్ రామకృష్ణను బెదిరించిన కేసులో టీడీపీ నేత కూన రవికుమార్ పోలీసులకు లొంగిపోయారు. కేసు నమోదైనప్పటి నుంచి కూన రవి కుమార్ కనిపించకుండా పోయారు.

శ్రీకాకుళం: తాహిసిల్దార్ రామకృష్ణను దుర్భాషలాడిన కేసులో టీడీపీ నేత కూన రవికుమార్ శ్రీకాకుళం జిల్లా పొందుగుల పోలీసులకు లొంగిపోయారు. గత నాలుగు రోజులుగా అజ్ఢాతంలో ఉన్న ఆయన బుధవారం పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. కేసు నమోదు చేసినప్పటి నుంచి రవి కుమార్ కనిపించకుండా పోయారు. 

కూన రవి కుమార్ లొంగుబాటు సమయంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద యెత్తున పొందుగుల పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. తనను కూన రవికుమార్ పోన్ లో దుర్భాషలాడారని శ్రీకాకుళం జిల్లా పొందుగుల తాహిసిల్దార్ తామరాపల్లి రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశఆరు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Also Read: అసభ్య పదజాలంతో దూషణలు: అజ్ఞాతంలోకి టీడీపీ నేత కూన రవికుమార్

కూన రవికుమార్ ను అరెస్టు చేసేందుకు పోలీసులు సోమవారంనాడు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. అయితే అప్పటికే ఆయన ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇటీవల రామకృష్ణ బదిలీపై పొందుగులకు వచ్చారు. ఈ నెల 16వ తేదీిన గొరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్ సోదరుడికి చెందిన రెండు జెసీబీలను, నాలుగు టిప్పరను స్వాధీనం చేసుకున్నారు. ఇసుక తవ్వుతుండగా రామకృష్ణ అక్కడికి చేరుకుని వాటిని సీజ్ చేశారు. 

దాంతో కూన రవికుమార్ ఫోన్ చేసి రామకృష్ణను బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించి ఆడియో రికార్డింగు కూడా వెలుగు చూసింది. వాహనాలను విడిచిపెట్టు... లేదంటే లంచం డిమాండ్ చేశావని ఫిర్యాదు చేస్తానని రవికుమార్ రామకృష్మను బెదిరించారు. పదివేలు కావాలా, లక్ష  కావాలా అంటూ రవి కుమార్ అసభ్య పదజాలంతో దూషించారు.

click me!