ఎల్జీ పాలిమర్స్ ఘటన: అంతటికి కారణం ఆ ఒక్కడే!

By Sree sFirst Published May 27, 2020, 9:02 AM IST
Highlights

గ్యాస్ లీక్ జరిగి 12 మంది ప్రాణాలు పోవడానికి అసలు కారణం విశాఖపట్నంలోని ఫ్యాక్టరీస్‌ డిపార్టుమెంటేనని ప్రభుత్వం నియమించిన కమిటీ తెలిపింది. అదే విషయాన్నే ప్రభుత్వానికి సమర్పించిన తన నివేదికలో పొందుపరిచింది సదరు కమిటీ. 

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆ కంపెనీని ప్రభుత్వం సీజ్ చేసిన విషయం తెలిసిందే! గ్యాస్ లీక్ ఎలా జరిగింది, దానికి బాధ్యులెవరు అని నిగ్గు తేల్చే పనిలో పడ్డ అధికార యంత్రాంగం ఆ దిశగా వేగంగా దర్యాప్తును జరుపుతోంది.  

గ్యాస్ లీక్ జరిగి 12 మంది ప్రాణాలు పోవడానికి అసలు కారణం విశాఖపట్నంలోని ఫ్యాక్టరీస్‌ డిపార్టుమెంటేనని ప్రభుత్వం నియమించిన కమిటీ తెలిపింది. అదే విషయాన్నే ప్రభుత్వానికి సమర్పించిన తన నివేదికలో పొందుపరిచింది సదరు కమిటీ. 

సీనియర్ అధికారి నీరబ్‌కుమార్‌  అధ్యక్షతన ఏర్పాటైన హై పవర్‌ కమిటీకి ఈ నివేదికను రెండురోజుల క్రితమే ఫ్యాక్టరీస్ విభాగం ఉన్నతాధికారులతో నియమించిన కమిటీ అందజేసింది. ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం నియమించిన ఆరు కమిటీల్లో ఇది కూడా ఒకటి. 

ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరగడానికి డీసీఐ ఆఫ్ ఫ్యాక్టరీస్ విశాఖపట్నం అధికారి కేబీఎస్‌ ప్రసాద్‌ నిర్లక్ష్యమే కారణమని నియమించిన కమిట అభిప్రాయపడింది. పరిశ్రమల్లో రసాయన ప్రమాదాల నివారణకు కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో ఆయన కార్యదర్శి అని, ఆయన నిర్లక్ష్యాన్ని సొంత విభగానికే చెందిన సీనియర్ అధికారులే దాచిపెడుతున్నారని కమిటీ తెలిపింది. 

ఇంతవరకు ఆ కంపెనీ చుట్టుపక్కల ఏనాడు కూడా మోక్ డ్రిల్ల్ నిర్వహించిన పాపాన పోలేదని, అంతే కాకుండా అక్కడి ప్రజలకు కనీసంక్ ఆపత్కాలీన సమయంలో ఎలా తప్పించుకోవాలో కనీస అవగాహన కూడా కల్పించలేదని ఆ కమిటీ అభిప్రాయపడింది. 

ఈ కంపెనీని ఇప్పటివరకు సదరు అధికారి ఒక్కసారి కూడా తనిఖీ చేసిన పాపాన పోలేదని, పై అధికారులు ఎన్నిసార్లు తనిఖీ నిర్వహించామని చెప్పినప్పటికీ.... ఏనాడు కూడా తనిఖీ నిర్వహించలేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది. 

ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాదం ఏదో అనుకోకుండా జరిగిందని అందరూ భావిస్తున్నారు తప్ప...  ఫ్యాక్టరీస్‌, కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక విభాగాల నుంచి సరైన తనిఖీ విధానాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న బేసిక్ పాయింట్ ను మర్చిపోయారని వారు పేర్కొన్నారు. 

సదరు అధికారి ప్రసాద్ నియామకమే రూల్స్ కు విరుద్ధంగా జరిగిందని, ఆయనకు సరైన అనుభవం లేనిదే ఈ పోస్టులో నియమించారని కమిటీ ఆరోపించింది. ఆయన తన పరపతిని ఉపయోగించుకొని అధికారులను, రాజకీయ నాయకులను మేనేజ్ చేసి విశాఖలో ఈ పోస్టింగ్ తెచ్చుకున్నాడని వారు అభిప్రాయపడ్డారు. 

click me!